పద్మ అవార్డుల నామినేషన్లు పారంభం
'పద్మ' విభాగంలో పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ అవార్డులు ఇస్తారు.
- అత్యున్నత పురస్కారాలకు నోటిఫికేషన్ విడుదల
- జూలై 31 వరకు నామినేషన్లు
- వెల్లడించిన కేంద్ర ప్రభుత్వం
దిశ, నేషనల్ బ్యూరో: దేశంలోనే అత్యున్నత 'పద్మ' అవార్డులు-2026 కోసం నామినేషన్లు ప్రారంభమైనట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రతీ ఏడాది గణతంత్ర దినోత్సవం సందర్భంగా పద్మ అవారులు ప్రకటిస్తారు. అయితే వీటికి సంబంధించిన నామినేషన్లు స్వీకరిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. జూలై 31లోపు పద్మ అవార్డులకు నామినేషన్లను ఆయా రంగాల్లో పంపవచ్చని చెప్పింది. పద్మ అవార్డులకు సంబంధించిన నామేషన్లు, సిఫార్సులు జాతీయ అవార్డుల పోర్టల్ https://awards.gov.inలో స్వీకరించబడతాయని తెలిపింది.
'పద్మ' విభాగంలో పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ అవార్డులు ఇస్తారు. దేశంలోని అత్యున్నత గౌరవ అవార్డులను 1954లో ప్రారంభించారు. కళ, సాహిత్యం- విద్య, క్రీడలు, వైద్యం, సామాజిక సేవ, సైన్స్ అండ్ ఇంజనీరింగ్ , ప్రజా పనులు, పౌర సేవ, బిజినెస్ అండ్ ఇండస్ట్రీస్ వంటి పలు విభాగాల్లో విశిష్టమైన, అసాధారణ విజయాలు సాధించిన వారికి ఈ అవార్డులు ఇస్తారు. వైద్యులు, శాస్త్రవేత్తలు తప్ప ప్రభుత్వం, ప్రభుత్వ రంగం సంస్థల్లో పని చేసే ఉద్యోగులు ఈ పద్మ అవార్డులకు అర్హులు కాదు. కాగా, పద్మ అవార్డులను ప్రజా అవార్డులుగా మార్చడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని.. అందుకే పౌరులు అందరూ నామినేషన్లు, సిఫార్సులను చేయాలని కేంద్ర ప్రభుత్వం అభ్యర్థించింది.
ఈ అవార్డులకు పౌరులు కూడా తమను తాము నామినేట్ చేసుకోవచ్చని పేర్కొంది. మహిళలు, బలహీన వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, వికలాంగులతో పాటు సమాజంలో నిస్వార్థ సేవలు చేస్తున్న వ్యక్తులు అవార్డుల కోసం అప్లయ్ చేసుకోవచ్చు. వారి విశిష్ట సేవలు, గొప్పతనానికి నిజమైన గుర్తింపు ఈ అవార్డుల ద్వారా లభిస్తుందని కేంద్రం పేర్కొంది. ఈ అవార్డుకు సంబంధించిన మరిన్ని వివరాలు హోం మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్‌లో ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది.