సీఏఏను రద్దు చేసే అధికారం ఏ రాష్ట్రానికీ లేదు: బెంగాల్‌లో రాజ్‌నాథ్ సింగ్

మమతా బెనర్జీ ప్రజలకు అసత్యాలను ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.

Update: 2024-04-21 14:00 GMT

దిశ, నేషనల్ బ్యూరో: కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)కు సంబంధించి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. బెంగాల్‌లో ఎన్నికల ప్రచారం సందర్భంగా మాల్దాలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడిన రాజ్‌నాథ్ సింగ్.. సీఏఏ గురించి మమతా బెనర్జీ ప్రజలకు, ముఖ్యంగా ముస్లిం సమాజానికి అసత్యాలను ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ఈ చట్టం హింసకు గురైన మైనారిటీల భద్రతలకు హామీ ఇస్తుందని పేర్కొన్నారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్‌లలో హింసించబడి మతపరమైన మైనారిటీలు మన ప్రజలు కాబట్టి వారికి సీఏఏ భద్రతను కల్పిస్తుంది. సీఏఏను రద్దు చేయాలని దీదీ చేసిన వ్యాఖ్యలు బదులిచ్చిన రాజ్‌నాథ్ సింగ్, సీఏఏను రద్దు చేసే అధికారం ఏ రాష్ట్రానికీ లేదు, ప్రపంచంలో ఏ శక్తీ ఈ చట్టాన్ని ఆపలేదన్నారు. మమతా బెనర్జీ ప్రజలకు ఎందుకు అబద్దాలు చెబుతున్నారో అడగాలనుకుంటున్నాను. అవినీతిపై టీఎంసీ, కాంగ్రెస్ పార్టీలపై విమర్శలు చేసిన ఆయన, గత 10 ఏళ్లలో బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై ఎలాంటి అవినీతి ఆరోపణలు లేవని అన్నారు. టీఎంసీ, కాంగ్రెస్ నేతలు అవినీతిలో కూరుకుపోయారని, అందుకే వారిని జైల్లోకి నెట్టారని తెలిపారు. టీఎంసీ రాష్ట్రాన్ని పాలిస్తోంది, దానికి, కాంగ్రెస్‌కు మధ్య తేడా లేదు' అని రాజ్‌నాత్ సింగ్ పేర్కొన్నారు.  

Tags:    

Similar News