PM Modi: మోడీ అధికారంలో ఉన్నంతవరకు ఇంచు భూమి అక్రమించలేరు

సరిహద్దుల్లో చైనాతో ఉద్రిక్తతల నడుమ కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు.

Update: 2022-12-13 09:13 GMT

న్యూఢిల్లీ: సరిహద్దుల్లో చైనాతో ఉద్రిక్తతల నడుమ కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. నరేంద్ర మోడీ అధికారంలో ఉన్నంత వరకు ఏ ఒక్కరూ కూడా ఇంచు భూమిని అక్రమించలేరని అన్నారు. మంగళవారం ఆయన పార్లమెంటు ఆవరణలో మీడియాతో మాట్లాడారు. రాజీవ్ గాంధీ ఫౌండేషన్ విదేశీ నిధులను రద్దు చేసినందుకే కాంగ్రెస్ పార్లమెంటులో సరిహద్దు అంశాన్ని లేవనెత్తిందని దుయ్యబట్టారు. రాజీవ్ గాంధీ ఫౌండేషన్ కు చైనా ఎంజసీ నుంచి రూ.1.35 కోట్లు వచ్చాయని ఆరోపించారు. విదేశీ నిధుల చట్టానికి అనుగుణంగా లేవనే రిజిస్ట్రేషన్ రద్దు చేసినట్లు పేర్కొన్నారు. నెహ్రుకు చైనాపై ఉన్న ప్రేమ కారణంగానే ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత శాశ్వత సభ్యత్వ సీటు త్యాగం చేసిందని అన్నారు.


Tags:    

Similar News