ఎలాంటి ఐడీ అవసరం లేదు.. 2 వేల నోట్ల మార్పుపై SBI క్లారిటీ
2 వేల నోటు మార్చుకోవడం పై SBI క్లారీటి ఇచ్చింది. ఒకేసారి 20 వేల వరకు మార్చుకోవడానికి ఎటువంటి ఐడీ ప్రూఫ్ కానీ, లేదా ఫారం నింపాల్సిన అవసరం లేదని బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది.
దిశ, వెబ్‌డెస్క్: 2 వేల నోటు మార్చుకోవడం పై SBI క్లారీటి ఇచ్చింది. రోజుకు ఒకేసారి 20 వేల వరకు మార్చుకోవడానికి ఎటువంటి ఐడీ ప్రూఫ్ కానీ, లేదా ఫారం నింపాల్సిన అవసరం లేదని బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది. 2 వేల నోటు రద్దు అనంతరం ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొనడంతో ఎస్బీఐ ఈ ప్రకటన చేసింది. ₹2,000 కరెన్సీ నోట్లు చలామణి నుండి ఉపసంహరించబడుతున్నాయి. ఈ నోట్లను మే 23 నుండి సెప్టెంబర్ 30 వరకు బ్యాంకులో డిపాజిట్ చేయాలని, మార్చుకోవాలని RBI ప్రజలను కోరింది. దీంతో ప్రజలు రెండు వేల నోట్లను బయటకు తీసి.. డిపాజిట్ ఏటీఎం మిషన్‌ల వద్ద బారులు తీరుతున్నారు. అలాగే మరోపక్క డబ్బులు అవసరం ఉండి ఏ ATM వద్దకు వెళ్లిన అన్ని రెండు వేల నోట్లు వస్తున్నాయని కొంతమంది ప్రజలు ఆరోపణలు చేస్తున్నారు.