2024లో మోడీకి తిరుగులేదు.. జేడీ(యూ) పార్లమెంటరీ బోర్డు మాజీ చీఫ్

Update: 2023-04-21 14:35 GMT

న్యూఢిల్లీ: వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోడీకి తిరుగులేదని జేడీ(యూ) పార్లమెంటరీ బోర్డు మాజీ చీఫ్ ఉపేంద్ర కుష్వాహ శుక్రవారం చెప్పారు. ముందురోజు కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో ఆయన సమావేశమయ్యారు. ఢిల్లీ నుంచి తిరిగి వెళుతూ విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడారు. ప్రతిపక్ష ఐక్యత కోసం బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ చేస్తున్న ప్రయత్నాలను కుష్వాహ ఎగతాళి చేశారు. రాష్ట్రంలో ఎవరితో అయితే ఆయన పొత్తు పెట్టుకున్నారో వాళ్లు మాత్రమే జేడీ (యూ)తో ఉన్నారని చెప్పారు. గురువారం సాయంత్రం అమిత్ షాతో సమావేశంలో ఏం జరిగిందన్న ప్రశ్నకు కుష్వాహ సమాధానిమిస్తూ.. ‘ఊహాగానాలు చేసుకునే స్వేచ్ఛ మీకందరికీ ఉంది.

నాకు తోచింది మాత్రమే మాట్లాడాను’ అని అన్నారు. ఎన్‌డీఏలో చేరతారా? అన్న ప్రశ్నకు సమాధానమిస్తూ.. ప్రస్తుతం ఆ వివరాలన్నీ చెప్పే స్థితిలో లేనని, సమయం వచ్చినప్పుడు తప్పకుండా చెబుతానని అన్నారు. కొన్ని నెలల క్రితం జేడీ (యూ)తో తెగదెంపులు చేసుకున్న కుష్వాహ రాష్ట్రీయ లోక్‌ జనతాదళ్‌ను స్థాపించిన సంగతి తెలిసిందే. నిజానికి కుష్వాహ గతంలో ఎన్‌డీఏ మిత్రపక్షంలో ఉన్నారు. రాష్ట్రీయ లోక్ సమతా పార్టీకి నాయకత్వం వహిస్తున్నప్పుడు మోడీ తొలి మంత్రి వర్గంలో మంత్రి పదవిని అనుభవించారు. అయితే 2019 ఎన్నికలకు ముందు బీజేపీ నేతృత్వంలోని సంకీర్ణాన్ని విడిచిపెట్టి ఆర్‌జేడీ, కాంగ్రెస్‌తో పాటు ఇతర చిన్న పార్టీలతో కూడిన మహాఘట్‌ బంధన్‌లో చేరారు.

Tags:    

Similar News