బీజేపీతో తెగదెంపులు.. అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే ‘ఒంటరి పోరాటం’

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తు గురించి అన్నా డీఎంకే ప్రధాన కార్యదర్శి పళనిస్వామి ఆసక్తికర కామెంట్లు చేశారు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో పొత్తుపెట్టుకోమని స్పష్టం చేశారు.

Update: 2024-06-08 17:40 GMT

దిశ, నేషనల్ బ్యూరో: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తు గురించి అన్నా డీఎంకే ప్రధాన కార్యదర్శి పళనిస్వామి ఆసక్తికర కామెంట్లు చేశారు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో పొత్తుపెట్టుకోమని స్పష్టం చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ పనితీరు గురించి ఆయన మాట్లాడారు. బీజేపీ, ఇండియా కూటమికి అనేకమంది జాతీయ నాయకులు ఉన్నారని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్నాడీఎంకే అభ్యర్థులందరి కోసం తాను ఒంటరిగా ప్రచారం చేశానని చెప్పుకొచ్చారు. 2019 ఎన్నికలతో పోలిస్తే.. పార్టీకి ఒకశాతం ఓటు బ్యాంకు పెరిగిందని.. అదే తన విజయమని అన్నారు.

ఏఐడీఎంకేకు పెరిగిన ఓట్లు

తమిళనాడులో బీజేపీ ప్రాబల్యం సాధిస్తుందనే వాదనలను పళనిస్వామి కొట్టిపారేశారు. ఏఐడీఎంకే ఓట్లు ఏ ఇతరపార్టీకి పడలేదని అన్నారు. బీజేపీ, డీఎంకేల ఓట్లు తగ్గాయి కానీ.. తమ ఓట్లు ఎక్కడికి పోలేదని స్పష్టం చేశారు. మూడోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించనున్న మోడీకి అభినందనలు తెలిపారు. మొత్తం 39 లోక్ సభ సీట్లు ఉన్న తమిళనాడులో అధికార డీఎంకే హవా కొనసాగించింది. 22 స్థానాల్లో డీఎంకే అభ్యర్థులు గెలుపొందారు. కాంగ్రెస్ కు 9 సీట్లు వచ్చాయి. కాగా.. ఈసారి ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిలో భాగమైన అన్నా డీఎంకేకు ఒక్కసీటు రాలేదు. మరోవైపు, పోటీ చేసిన ప్రతిచోట బీజేపీ అభ్యర్థులు ఓటమిపాలయ్యారు.


Similar News