కింగ్ మేకర్ గా బిహార్ సీఎం.. నెక్ట్స్ పీఎం నితీశ్ కుమారేనా?.. వైరల్ అవుతున్న మీమ్స్

లోక్ సభ ఎన్నికల ఫలితాలు కాషాయ పార్టీ అంచనాలు తారుమారయ్యాయి. బీజేపీ చెప్పినట్లు ఎన్డీయే కూటమికి 400 సీట్లు రావట్లేదు.

Update: 2024-06-04 10:21 GMT

దిశ, నేషనల్ బ్యూరో: లోక్ సభ ఎన్నికల ఫలితాలు కాషాయ పార్టీ అంచనాలు తారుమారయ్యాయి. బీజేపీ చెప్పినట్లు ఎన్డీయే కూటమికి 400 సీట్లు రావట్లేదు. ఎన్నో ఆశలు పెట్టుకున్న ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో అనూహ్య ఫలితాలు వెలువడ్డాయి. ప్రస్తుతం ఉన్న ట్రెండ్స్ ప్రకారం బీజేపీకి మ్యాజిక్ ఫిగల్ 272 రావడం కష్టంగా మారింది. ఇలాంటి టైంలో జేడీయూ అధినేత నితీశ్ కుమార్ కింగ్ మేకర్ గా మారొచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీంతో నితీశ్ కుమార్ గురించి సోషల్ మీడియాలో మీమ్స్ మొదలయ్యాయి.


నితీశ్ కు పీఎం ఆఫర్ వస్తే..

రాహుల్ గాంధీ నితీశ్ కుమార్ ని పిలిచి ప్రధానిని చేస్తా అని ఆఫర్ ఇస్తే.. ఆయన కాంగ్రెస్ తో చేతులు కలుపుతారని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. బీజేపీకి మ్యాజిక్ ఫిగర్ రాకుంటే పరిస్థితి ఏంటని మరో యూజర్ అన్నారు. ఇప్పటికే నితీశ్ కుమార్ కాంగ్రెస్ హెడ్ క్వార్టర్స్ లో కూర్చుని ఉంటారని మరో నెటిజన్ సెటైర్ వేశారు. ఇండియా కూటమి చేయాల్సిందల్లా.. “నితీశ్ జీ రండి.. మిమ్మల్ని సీఎం చేస్తా” అని అనడమే అని మరొకరు అన్నారు. ఇండియా కూటమి అలా చెప్తే.. నితీశ్ వెనక్కి తిరిగి చూడకుండా పరిగెత్తుకు వస్తారని అవాక్కులు పేల్చారు.

నితీశ్, చంద్రబాబు దయలో బీజేపీ

“ఎన్డీయేకు వచ్చిన సీట్ల సంఖ్యలు అస్థిరమైనవని. బీజేపీకి 272 రాకపోతే, నితీష్ కుమార్, అజిత్ పవార్, చంద్రబాబు నాయుడు, కుమారస్వామి వంటి వారు పార్టీ మారరని మీరు అనుకుంటున్నారా?’’ అని మరొకరు పేర్కొన్నారు. బీజేపీ ఇప్పుడు నితీశ్ కుమార్, చంద్రబాబు దయలో ఉందని మరో నెటిజన్ రాసుకొచ్చారు.


Similar News