2023-24లో వృద్ధిరేటు 6.5 శాతమే! పార్లమెంట్‌కు ఆర్థిక సర్వే సమర్పించిన Nirmala Sitharaman

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2022-23 ఆర్థిక సర్వేను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు.

Update: 2023-01-31 08:28 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2022-23 ఆర్థిక సర్వేను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగం పూర్తయిన తర్వాత నిర్మలా సీతారామన్ సభకు ఆర్థిక సర్వేను సర్పించారు. ఈ సందర్భంగా 2023-24 ఆర్థిక సంవత్సరంలో దేశ జీడీపీ వృద్ధిరేటు 6.5 శాతంగా ఉండవచ్చని ఆర్థిక సర్వే అంచనా వేసింది. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో వృద్ధిరేటు అంచనా 7 శాతం కాగా ఇది 2021-22లో 8.7 శాతంగా ఉంది. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా భారత్ తన స్థానాన్ని పదిలం చేసుకుందని ఆర్థిక సర్వే పేర్కొంది. పీపీపీ పరంగా ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ భారత్ అని ఎక్స్ ఛేంజ్ రేటు పరంగా ఐదో అదిపెద్ధ ఆర్థిక వ్యవస్థ అని స్పష్టం చేసింది. దేశంలో కరోనా కారణంగా మందగించిన ఆర్థిక పరిస్థితులు తిరిగి గాడిన పడ్డాయని పేర్కొంది. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం 6.8 శాతంగా ఉండగా ఇది ప్రైవేట వినియోగాన్ని, పెట్టుబడులు బలహీనపరచలేదని స్పష్టం చేసింది. కేంద్ర బడ్జెట్ సమర్పణకు ముందు గతేడాదికి సంబంధించిన ఆర్థిక సర్వేను పార్లమెంట్ ఉభయ సభల ముందు ప్రవేశపెట్టడం ఆనవాయితీగా వస్తోంది.

Tags:    

Similar News