New rule for schools: పంద్రాగస్టు నుంచి స్కూల్స్ లో కొత్త రూల్.. గుడ్ మార్నింగ్ స్థానంలో..!

ఇకపై పాఠశాలల్లో గుడ్ మార్నింగ్ పలకరింపు స్థానంలో కొత్త పలకరింపు రానున్నది.

Update: 2024-08-09 07:59 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: పంద్రాగస్టు నుంచి పాఠశాలల్లో కొత్త రూల్ రాబోతున్నది. ఉదయం వెళ్లగానే స్కూల్స్ లో వినిపించే గుడ్ మార్నింగ్ అనే పలకరింపు కనుమరుగు కానున్నది. దాని స్థానంలో జై హింద్ అనే పదం వాడాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు హర్యానా రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్ కీలక నిర్ణయం తీసుకున్నది. ఆగస్టు 15 న ఇండిపెండెన్స్ డే పురస్కరించుకుని ప్రభుత్వం ఈ ప్రకటన విడుదల చేసింది. పంద్రాగస్టు నాడు జాతీయపతాక విష్కరణకు ముందు నుంచి ఈ ఆదేశాలు అమల్లోకి వస్తాయని పేర్కొన్నది. రాష్ట్రంలోని అన్ని పాఠాశాల్లోని టీచర్లకు, తోటి స్నేహితులకు పలకరింపుగా గుడ్ మార్నింగ్ కు బదులు జై హింద్ అనే పదం ఉపయోగించాలని ఆదేశించింది. చిన్ననాటి నుంచే విద్యార్థులలో దేశభక్తి, దేశం పట్ల గౌరవం, ఐక్యత భావాలు పెంపొందించాలనే ఉద్దేశంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈ ఆదేశాల్లో పేర్కొన్నారు. కాగా స్వాతంత్ర్య పోరాటంలో దేశ ప్రజలను ఏకం చేసేందుకు నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆజాద్ హింద్ ఫౌజ్ ను ఏర్పాటు చేశారు. ఆ సమయంలో జైహింద్ అనే నినాదం దేశప్రజలు, స్వాతంత్ర్య పోరాట యోధులను ఒక్కతాటిపైకి తీసుకువచ్చేందుకు ఈ నినాదం పురికొల్పింది. 

Tags:    

Similar News