లక్షద్వీప్‌లో కొత్త ఎయిర్‌పోర్ట్!.. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
ప్రధాని మోడీ ఇటీవల లక్షద్వీప్ పర్యటన సందర్భంగా అక్కడ పర్యాటక అభివృద్ధి కోసం పలు కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు.
దిశ, డైనమిక్ బ్యూరో : ప్రధాని మోడీ ఇటీవల లక్షద్వీప్ పర్యటన సందర్భంగా అక్కడ పర్యాటక అభివృద్ధి కోసం పలు కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. భారత ప్రజలంతా ద్వీపాన్ని విధిగా సందర్శించాలని ప్రధాని ప్రజలకు పిలుపునిచ్చారు. దీంతో, లక్షద్వీప్‌పై సోషల్ మీడియాలో ఒక ట్రెండ్ క్రియేట్ అయ్యింది. సెలబ్రెటీలు సైతం లక్షద్వీప్ దీవుల గురించి పోస్టులు పెడుతున్నారు. దీంతో అక్కడి బీచ్‌లు సందర్శించేందుకు ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే లక్షద్వీప్ పర్యాటక అభివృద్ది కోసం అక్కడి మినికాయ్ ద్వీపంలో కొత్త ఎయిర్‌పోర్ట్ నిర్మించాలని కేంద్ర కీలక నిర్ణయం తీసుకుందని సమాచారం. అయితే, పౌర విమానాలతో పాటు మిలటరీ ఎయిర్ క్రాఫ్ట్స్, ఫైటర్ జెట్స్‌కు కొత్త ఎయిర్‌పోర్ట్ జాయింట్ ఎయిర్ ఫీల్డ్‌గా ఉంటుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. కాగా, మాల్దీవుల టూరిజం దెబ్బతింటుందని అక్కడి సంబంధించిన మంత్రులు ప్రధానిపై తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో సోషల్ మీడియాలో బాయ్‌కాట్ మాల్దీవ్స్, లక్షద్వీప్‌ను సందర్శించాలని దాదాపు ముడు రోజులుగా సోషల్ మీడియాలో ట్రెండ్ నడుస్తోంది.
Read More..