నీరజ్ చోప్రా కు పరమ విశిష్ట సేవా పురస్కారం

Update: 2022-01-25 15:24 GMT

న్యూఢిల్లీ : గతేడాది జరిగిన టోక్యో ఒలింపిక్స్-2020 గేమ్స్‌లో భారత్‌కు స్వర్ణ పథకం తీసుకొచ్చిన నీరజ్ చోప్రాకు కేంద్ర ప్రభుత్వం పరమ వశిష్ఠ సేవా పురస్కారంతో సత్కరించింది. జనవరి -26 గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్ చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని నీరజ్ చోప్రా అందుకోనున్నాడు. టోక్యో ఒలింపిక్స్‌లో జావెలిన్ త్రో విభాగంలో నీరజ్ బంగారు పతకాన్ని గెలుచుకున్న విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలోనే నాలుగో రాజ్‌పుతానా రైఫిల్స్ ద్వారా 'పరమ వశిష్ఠ సేవా పతకాన్ని అందజేయనుంది.

2016లో నాయబ్ సుబేదార్‌గా నాలుగో రాజ్‌పుతానా రైఫిల్స్‌లో నీరజ్ నేరుగా ఎంట్రీ ఇచ్చాడు. అంతకుముందు పూణెలోని మిషన్ ఒలింపిక్స్ వింగ్, ఆర్మీ స్పోర్ట్స్ ఇన్‌స్టిట్యూట్‌లో శిక్షణ కోసం ఎంపికయ్యాడు. నీరజ్ ఒలంపిక్స్‌లో భారత్‌కు స్వర్ణం తీసుకొచ్చినందున హర్యానా ప్రభుత్వం 2022 రిపబ్లిక్ డే పరేడ్ సందర్భంగా నీరజ్ చోప్రా జీవిత-పరిమాణ ప్రతిరూపాన్ని శకటంపై పట్టిక రూపంలో ప్రదర్శించనుంది.

Tags:    

Similar News