Drug Bust: మణిపూర్ నుంచి మేఘాలయకు డ్రగ్స్.. ఇద్దరి అరెస్ట్
దిశ, నేషనల్ బ్యూరో : మణిపూర్‌లోని చురాచంద్‌పూర్ నుంచి మేఘాలయలోని షిల్లాంగ్‌కు స్మగ్లింగ్ చేస్తున్న 6.790 కేజీల మెథాంఫేటమైన్ డ్రగ్స్‌ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) గౌహతి యూనిట్ అధికారులు సీజ్ చేశారు.
దిశ, నేషనల్ బ్యూరో : మణిపూర్‌లోని చురాచంద్‌పూర్ నుంచి మేఘాలయలోని షిల్లాంగ్‌కు స్మగ్లింగ్ చేస్తున్న 6.790 కేజీల మెథాంఫేటమైన్ డ్రగ్స్‌ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) గౌహతి యూనిట్ అధికారులు సీజ్ చేశారు. నిఘా వర్గాల సమాచారం ప్రకారం.. జులై 23న సాయంత్రం అసోంలోని సిల్చార్‌లో ఉన్న సోనారీ రోడ్ వద్ద డ్రగ్స్‌తో వెళ్తున్న ఇద్దరు వ్యక్తులను ఎన్‌సీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
పట్టుబడిన వ్యక్తులలో ఒకరిని మణిపూర్‌లోని చురాచంద్‌పూర్‌కు చెందిన గౌజాలాల్ సింగ్‌సన్, మణిపూర్‌లోని సంగైకోట్‌కు చెందిన తంగ్మిన్‌లున్ లుంగ్‌డిమ్‌గా గుర్తించారు. ఈ నెల ప్రారంభంలోనూ అసోం పోలీసుల ప్రత్యేక టాస్క్ ఫోర్స్ రెండు వేర్వేరు ఆపరేషన్లలో రూ.17.5 కోట్లు విలువైన 2 కిలోల కంటే ఎక్కువ హెరాయిన్‌ను స్వాధీనం చేసుకుంది. ఆ ఘటనల్లో నలుగురు డ్రగ్ పెడ్లర్లను అదుపులోకి తీసుకుంది.