నేతాజీ ఉండుంటే భారత్ ముక్కలయ్యేది కాదు.. అజిత్ దోవల్ సంచలన వ్యాఖ్యలు

నేతాజీ ఉండుంటే భారత్ ముక్కలయ్యేది కాదని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Update: 2023-06-17 15:48 GMT

న్యూఢిల్లీ : భారత్ స్వాతంత్ర్యం సాధించుకున్న తర్వాత ఒకవేళ నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఉండుంటే దేశ విభజన జరిగేది కాదని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ వ్యాఖ్యానించారు. దేశానికి స్వాతంత్ర్యం ఇవ్వమని అడుక్కునే వ్యక్తిత్వం బోస్ ది కాదని.. ఆయన జీవించి ఉంటే బ్రిటీష్ వాళ్లతో రాజీ లేని పోరాటం చేసి స్వాతంత్ర్యం సాధించి ఉండేవారని అభిప్రాయపడ్డారు. ఢిల్లీలో శనివారం జరిగిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్మారక కార్యక్రమంలో దోవల్ ఈ కామెంట్స్ చేశారు. పాకిస్తాన్ జాతిపిత మొహమ్మద్ అలీ జిన్నా కూడా తాను అంగీకరించే ఒకే ఒక్క నాయకుడు సుభాష్ చంద్రబోస్ అని చెప్పేవారని వెల్లడించారు.

1962లో సిద్ధంగా లేనందు వల్లే చైనాతో జరిగిన యుద్ధంలో భారత్ ఓడిపోయిందని ధోవల్ పేర్కొన్నారు. మనకు స్వాతంత్ర్యం వచ్చినందున సైన్యాన్ని రద్దు చేయాలనే ఆలోచన 1950 నుంచి 1962 వరకున్న కేంద్ర ప్రభుత్వానికి ఉండేదన్నారు. అందుకే సైన్యంతో పాటు తగిన యుద్ధ సామాగ్రి లేక చైనాతో యుద్ధంలో ఓడిపోయామన్నారు. మహాత్మా గాంధీని సవాలు చేసే ధైర్యం నేతాజీకి ఉండేదని, అయితే ఆయన గౌరవంతో మహాత్మా గాంధీకి సహకరించారని చెప్పారు.

Tags:    

Similar News