CAA చట్టమే మోడీ గ్యారంటీకి తాజా ఉదాహరణ: మోడీ కీలక వ్యాఖ్యలు

CAA చట్టమే మోడీ గ్యారంటీకి తాజా ఉదాహరణ అని దేశ ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-05-16 06:38 GMT

దిశ, వెబ్‌డెస్క్: CAA చట్టమే మోడీ గ్యారంటీకి తాజా ఉదాహరణ అని దేశ ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉత్తర్‌ప్రదేశ్‌ అజాంఘడ్‌లో ఎన్నికల ప్రచారంలో భాగంగా మోడీ మాట్లాడుతూ.. సీఏఏ కింద భారత పౌదరసత్వం ఇవ్వడం మొదలైందని అన్నారు. దేశంలో వీళ్లంగా చాలా ఏళ్లుగా శరణార్థులుగా ఉన్నారని మండిపడ్డారు. ఉత్తర్ ప్రదేశ్‌లోను లక్షలాది శరణార్థలున్నారని ఎద్దేవా చేశారు. ప్రజలంతా బీజేపీ, ఎన్డీఏ కూటమితోనే ఉన్నారని తెలిపారు. మోడీ పగ్యారెంజటీలపై ప్రజలకు నమ్మకం ఉందని చెప్పారు. మోడీ వెళ్తే .. సీఏఏ కూడా వెళ్తుందని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీ వెళ్తే 370 రద్దు కూడా వెళ్లిపోతుందని విపక్షాలు అంటున్నాయని వెల్లడించారు. నాల్గో దశలో జరిగిన పోలింగ్ లో శ్రీనగర్ లో ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారని మోడీ చెప్పుకొచ్చారు. పేదల అభివృద్ధి కోసం రాత్రి పగలు కష్టపడుతున్నానని పేర్కొన్నారు. ఉచితంగా రేషన్ అందిస్తున్నామని తెలిపారు. 70 ఏళ్లు పైబడిన వారి వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని చెప్పుకొచ్చారు. పేదల బాధలన్నీ తొలగిస్తామని హామీ ఇచ్చారు. దేశంలో పేలుళ్లు, ఉగ్రవాది జరిగినా ప్రజలు అజాంఘడ్ గురించి చర్చ జరిగేదన్నారు. స్లీపర్ సెల్స్ పై చర్చ జరిగేదన్నారు. ఇండియా కూటమి నేతలు పేదల రిజర్వేషన్లను ముస్లింలకు ఇవ్వాలనుకున్నారని మండిపడ్డారు. 70 ఏళ్లుగా హిందువులు, ముస్లింలు అంటూ విభజన రాజకీయాలు చేశారని తెలిపారు.


Similar News