Mumbai: నిత్య పెళ్లి కొడుకు అరెస్ట్.. ఏకంగా 20 మంది మహిళలకు కుచ్చుటోపి

పెళ్లిళ్ల పేరుతో మహిళలను మోసం చేస్తున్న ఓ నిత్య పెళ్లికొడుకును పోలీసులు అరెస్ట్ చేశారు.

Update: 2024-07-28 12:35 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: పెళ్లిళ్ల పేరుతో మహిళలను మోసం చేస్తున్న ఓ నిత్య పెళ్లికొడుకును పోలీసులు అరెస్ట్ చేశారు.నిందితుడి చేతిలో ఏకంగా 20 మంది మహిళలు మోసపోయారు. మహారాష్ట్రలో వెలుగుచూసిన ఘటన ప్రకారం 43 ఏళ్ల ఫిరోజ్ నియాజ్ షేక్ విడాకులు పొందిన మహిళలనే టార్గెట్ గా చేసుకొని మ్యాట్రీమోనీ సైట్ల ద్వారా వారి వివరాలు సేకరిస్తుంటాడు. అనంతరం వారి బాధలను గట్టెక్కిస్తానని చెప్పి, వారికి మాయమాటలు చెప్పి పెళ్లికి ఒప్పించేవాడు. అనంతరం వారిని పెళ్లి చేసుకొని నగలు, డబ్బు, తదితర వస్తువులతో ఉడాయించేవాడు.

అతడి చేతిలో మోసపోయిన ఓ మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు. పోలీసులు నిందితుడిని విచారించగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. నిందితుడిని మహారాష్ట్ర, థానే జిల్లాలోని కళ్యాణ్ ప్రాంతానికి చెందిన వ్యక్తి గా గుర్తించారు. అతడి నుంచి లక్ష రూపాయల నగదుతో పాటు ల్యాప్ టాప్, ఫోన్ సహా విలువైన వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే నిందితుడు మహారాష్ట్ర, ఢిల్లీ, యూపీ, గుజరాత్ ఇలా పలు చోట్ల 20కి పైగా మహిళలను మోసం చేశినట్లు పోలీసులు గుర్తించారు. అంతేగాక 2023లో ఇద్దరు మహిళల నుంచి దాదాపు 23 లక్షలు తీసుకొని పరారయ్యాడని ఎఫ్ఐఆర్ నమోదు అయినట్లు పోలీసుల విచారణలో తేలింది.

Tags:    

Similar News