ప్రధాని మోడీ 'మంగళసూత్ర' వ్యాఖ్యలకు తేజస్వి యాదవ్ కౌంటర్

ఘర్షణల కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి మహిళల మంగళసూత్రాలకు ఎవరు బాధ్యత వహించాలో ప్రధాని మోడీ చెప్పాలని

Update: 2024-04-25 10:15 GMT

దిశ, నేషనల్ బ్యూరో: కాంగ్రెస్ గెలిస్తే మహిళల మంగళసూత్రాలతో సహా ప్రజల వద్ద ఉన్నదనతా దోచుకుంటుందని ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలకు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ కౌంటర్ ఇచ్చారు. పెరుగుతున్న ధరల కారణంగా చాలామంది మహిళలు బంగారం కొనలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. విలేకరుల సమావేశంలో మాట్లాడైన తేజస్వి యాదవ్.. నోట్ల రద్దు కారణంగా కరోనా మహమ్మారి సమయంలో చాలామంది ప్రాణాలు కోల్పోయారని, పుల్వామా ఉగ్రవాద దాడి, సరిహద్దుల్లో చైనా సైనికులతో జరిగిన ఘర్షణల కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి మహిళల మంగళసూత్రాలకు ఎవరు బాధ్యత వహించాలో ప్రధాని మోడీ చెప్పాలని తేజస్వి యాదవ్ మండిపడ్డారు. 'ఎన్నికల సమయంలో ప్రజలకు సంబంధించిన సమస్యలపై మాట్లాడాలి. కానీ, ప్రధాని మోడీ మంగళసూత్రాల గురించి ఎందుకు మాట్లాడుతున్నారు. దేశంలోని చాలామంది మహిళలు బంగారం కొనలేని స్థితిలో ఉన్నారని మోడీకి తెలియదా అని ప్రశ్నించారు. కాగా, రెండో దశ పోలింగ్ సందర్భంగా బీహార్‌లో ఆర్జేడీ, మిత్రపక్షాలు మొత్తం ఐదు స్థానాలను గెలుచుకుంటాయని తేజస్వి యాదవ్ విశ్వాసం వ్యక్తం చేశారు. మరోవైపు, పూర్నియా నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బీమా భారతీకి టికెట్ ఇవ్వడంతో ఇండిపెండెంట్‌గా బరిలో దిగిన పూర్నియా మాజీ ఎంపీ రాజేష్ రంజన్ అలియాస్ పప్పు యాదవ్ గురించి మాట్లాడిన తేజస్వి యాదవ్.. ఈ ఎన్నికల్లో రెండు శక్తులు మాత్రమే పోటీలో ఉన్నాయి. ఒకటి రాజ్యాంగానికి ముప్పు తెచ్చే ఎన్డీఏ, మరొకటి రాజ్యాంగాన్ని కాపాడాలని చూస్తున్న ఇండియా కూటమి. అతను ఇండియా కూటమితో లేకపోతే ఎన్డీయేతో ఉన్నట్టు భావించాలి. కాబట్టి పప్పు యాదవ్ బీజేపీకి బీ-టీమ్ అని తేజస్వి యాదవ్ పేర్కొన్నారు. 

Tags:    

Similar News