జనవరి 1 నుంచి రూ.3 వేల నిరుద్యోగ భృతి.. అర్హతలు ఇవే?

కర్ణాటక ప్రభుత్వం నిరుద్యోగులకు భారీ శుభవార్త అందించింది.

Update: 2023-12-23 14:39 GMT

దిశ, వెబ్‌డెస్క్: కర్ణాటక ప్రభుత్వం నిరుద్యోగులకు భారీ శుభవార్త అందించింది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన ఐదు గ్యారంటీల్లో నిరుద్యోగ భృతి ఒకటి. కాగా 2024 జనవరి 1 నుంచి నిరుద్యోగులందరికి ప్రతి నెల 1500 నుంచి 3000 వేలు అందించనున్నారు. కాగా అర్హులైన నిరుద్యోగులు సేవా సింధు వెబ్‌సైట్‌లో డిసెంబరు 26 లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. 2022- 23 విద్యాసంవత్సరంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారై ఉండాలి. స్టడీ కంప్లీట్ అయ్యాక 6 నెలల వరకు ఎలాంటి ఉద్యోగం కలిగి ఉండకూడదు. డిగ్రీ, డిప్లొమా పాస్ హోల్డర్లకు ఈ పథకం వర్తిస్తుంది. డిగ్రీ చేసిన నిరుద్యోగులకు ఈ పథకం కింద నెలకు రూ.3000, డిప్లొమా చేసిన వారికి రూ. 1500 ఆర్థిక సాయం అందిస్తారు. రెండేళ్ల పాటు ఉద్యోగం చేసే వరకు ఈ డబ్బు లబ్దిదారుని అకౌంట్లో యాడ్ అవుతుంది.

కాగా నిరుద్యోగ యువత కర్ణాటక రాష్ట్రంలో జన్మస్థలం అయి ఉండాలి. ఈ పథకానికి దరఖాస్తు చేసేటప్పుడు యువకులు నిరుద్యోగులుగా ఉండాలి. గ్రాడ్యుయేషన్, డిప్లొమా పూర్తి చేయాలి. దరఖాస్తుకు చేసుకోవడానికి కర్ణాటకలో ఉంటున్నట్లు ఓటరు ఐడీ కార్డు ఉండాలి. ఆధార్ కార్డ్ టెన్త్ క్లాస్ మెమో, సర్టిఫికెట్ ఇంటర్ మెమో, సర్టిఫికెట్ గ్రాడ్యుయేషన్ మెమో, సర్టిఫికెట్ డిప్లొమా సర్టిఫికెట్ (డిప్లొమా హోల్డర్స్ దరఖాస్తుదారులు) కుటుంబ ఆదాయ ధృవీకరణ పత్రం దరఖాస్తుదారు మొబైల్ నెంబర్, బ్యాంకు ఖాతా వివరాలు కుల ధృవీకరణ పత్రం ఉండాలి.


Similar News