FREE RECHARGE: ముచ్చటగా మూడోసారి మోడీ ప్రమాణ స్వీకారం.. ఫ్రీ రీఛార్జ్‌పై కీలక ప్రకటన..?

నరేంద్ర మోడీ ముచ్చటగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.

Update: 2024-06-09 08:08 GMT

దిశ, వెబ్‌డెస్క్: నరేంద్ర మోడీ ముచ్చటగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. నరేంద్ర మోడీతో పాటు మరికొంతమంది కేంత్ర మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. నేడు రాత్రి 7. 30 గంటలకు నరేంద్ర మోదీ రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము ఎదుట ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అలాగే మోడీ సారధ్యంలో కొలువుదీరబోయే కొత్త మంత్రి వర్గంపై కూడా ఒక అంచనా వచ్చేసింది. కేబినెట్ లో చోటు దక్కిన ఎంపీలకు పీఎంవో కార్యాలయం నుంచి ఇప్పటికే ఫోన్ కాల్స్ వెళ్తున్నాయి. టీడీపీ ఎంపీల్లో రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్‌కు కాల్స్ వెళ్లాయి. అలాగే మిత్రపక్షాల ఎంపీల్లో కుమారస్వామి, ప్రతాప్ రావ్ జాదవ్ లకు కూడా కాల్స్ వెళ్లినట్లు టాక్ వినిపిస్తుంది. మంత్రి మండలిలో కిషన్ రెడ్డికి, బండి సంజయ్‌కు అవకాశం దక్కింది.

ఇకపోతే ప్రధానమంత్రి పీఠాన్ని అధిష్టించనున్న నేపథ్యంలో ఓ బంపర్ ఆఫర్ ప్రకటించబోతున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. అయితే దేశంలోని ప్రజలందరికీ 3 నెలల పాటు ఫ్రీ మొబైల్ రిఛార్జ్ అందించాలని మోడీ ప్రభుత్వం సిద్ధంగా ఉందట. మరీ ఈ వార్త ఎంతవరకు వాస్తవమో తెలియాలంటే రాత్రి 7. 30 వరకు ఎదురు చూడాల్సిందే.


Similar News