MODI : మన్ కీ బాత్‌లో పారిస్ ఒలింపిక్స్‌పై ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు

112వ ‘మన్ కీ బాత్’‌లో పారిస్ ఒలింపిక్స్‌పై ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-07-28 06:10 GMT

దిశ, వెబ్‌డెస్క్: 112వ ‘మన్‌కీ బాత్’‌లో పారిస్ ఒలింపిక్స్‌పై ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచమంతా పారిస్ ఒలింపిక్స్ గురించి చర్చించుకుంటుందన్నారు. అంతర్జాతీయ వేదికపై మువ్వన్నెల జెండా రెపరెపలాడాలని ప్రధాని కాంక్షించారు. ఒలింపిక్స్ లో పోటీ పడుతున్న మన క్రీడాకారులను పోత్సహిద్దామని పిలుపునిచ్చారు. మ్యాథ్య్ ఒలింపియాడ్ విజేతలకు మోడీ ప్రశంసలు తెలియజేశారు. డ్రగ్స్ మహమ్మారిని నిర్మూలించేందుకు మానస్ హెల్ప్ లైన్ వినయోగించుకోవాలని ప్రధాని మోడీ దేశ ప్రజలకు కోరారు. డ్రగ్స్ సరఫరా, వినియోగం గురించి సమాచారం తెలిస్తే స్థానిక పోలీసులకు సమాచారం అందజేయాలని రిక్వెస్ట్ చేశారు. 

Tags:    

Similar News