ప్రమాణ స్వీకారోత్సవానికి ముందు రాజ్‌ఘాట్‌లో మహాత్మాగాంధీ విగ్రహానికి నివాళులు అర్పించిన మోదీ
నేడు (జూన్ 9) దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
దిశ, వెబ్‌డెస్క్: నేడు (జూన్ 9) దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో అందరీ దృష్టి మంత్రివర్గంపై పడింది. ఎవరికీ ఏ పదవులు దక్కుతాయని ప్రజలంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే మోడీ ప్రమాణ స్వీకారోణాత్సవానికి ముందు రాజ్‌ఘాట్‌లో మహాత్మాగాంధీ విగ్రహానికి నివాళులు అర్పించారు. అనంతరం అక్కడి నుంచి నేరుగా బీజేపీ పార్టీ ఆఫీసుకు వెళ్లనున్నారు. ఈ కార్యక్రమానికి అతిరథ హహారథులతో పాటు సామాన్యులు కూడా ప్రత్యేక అతిథులుగా హాజరవ్వనున్నారు. ఈ నేపథ్యంలో ఎన్టీఏ కూటమి నాయకులు, ప్రతిపక్ష సభ్యులు, సినీ, క్రీడారంగ ప్రముఖులు, విదేశీ నేతలు, అగ్రశ్రేణి పారిశ్రామిక వేత్తలతో పాటు మరికొందరిని కూడా స్పెషల్ గెస్ట్స్‌లుగా ఆహ్వానించారు. ఈ జాబితాలో ట్రాన్స్‌జెండర్లు కూడా ఉండటం విశేషం. అలాగే నూతన పార్లమెంట్ భవన నిర్మాణ శ్రామికులు, పారిశుద్ధ్య కార్మికులు, వందే భారత్ రైళ్ల వంటి కీలక ప్రాజెక్టుల్లో పని చేసిన వారందరు కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానితులే.