అసెంబ్లీలో పోర్న్ వీడియోలు చూసిన ఎమ్మెల్యే
ప్రజాసమస్యల పరిష్కారానికి గళం విప్పాల్సిన అసెంబ్లీ వేదికగా ఓ ఎమ్మెల్యే చేసిన పని వివాదాస్పదమైంది.
దిశ, వెబ్‌డెస్క్: ప్రజాసమస్యల పరిష్కారానికి గళం విప్పాల్సిన అసెంబ్లీ వేదికగా ఓ ఎమ్మెల్యే చేసిన పని వివాదాస్పదమైంది. అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యే ఏకంగా పోర్న్ వీడియోలు చూడటం దూమారం రేపింది. ఈ ఘటన త్రిపురలో చోటు చేసుకుంది. త్రిపురలో జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో బాగ్ బాసా నియోజవర్గానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే జదబ్ లాల్ నాథ్ కుర్చీలో దర్జాగా కూర్చొని పోర్న్ వీడియోలు చూస్తుండగా కెమెరాకు చిక్కారు. ఈ వీడియో వైరల్ కావడంతో బీజేపీ ఎమ్మెల్యేపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.