Modi పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి అరెస్ట్

రాజ్యాంగాన్ని రక్షించాలని, ప్రధాని మోడీని చంపడానికి సిద్ధంగా ఉండాలంటూ ప్రధాని నరేంద్ర మోడీని ఉద్దేశించి మధ్యప్రదేశ్‌ మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత రాజా పటేరియా చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమైన విషయం తెలిసిందే.

Update: 2022-12-13 06:26 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : రాజ్యాంగాన్ని రక్షించాలని, ప్రధాని మోడీని చంపడానికి సిద్ధంగా ఉండాలంటూ ప్రధాని నరేంద్ర మోడీని ఉద్దేశించి మధ్యప్రదేశ్‌ మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత రాజా పటేరియా చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మంగళవారం ఉదయం మాజీ మంత్రి పటేరియాను పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు దామోహ్‌ జిల్లా హట్టాలోని ఆయన ఇంటికి చేరుకున్న పోలీసులు చర్యలు తీసుకున్నారు. అంతకుముందు మధ్యప్రదేశ్‌ హోంశాఖ మంత్రి నరోత్తమ్‌ మిశ్ర ఆదేశాల మేరకు పన్నా జిల్లాలోని పవయీ పోలీస్‌ స్టేషన్‌లో పటేరియాపై కేసు నమోదైంది.

కాగా, ఓ సమావేశంలో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి 'రాజ్యాంగాన్ని, మైనార్టీలు, దళితుల భవిష్యత్తును కాపాడేందుకు మోదీని చంపేందుకు సిద్ధం కావాలి. చంపడం అంటే ఆయనను ఓడించడమని అర్థం' అని పటేరియా అన్నట్లు సోమవారం ఓ వీడియో నెట్టింట వైరల్‌ అయింది. అయితే తన వ్యాఖ్యలపై రాజా పటేరియా వివరణ ఇచ్చుకున్నారు. తాను ప్రధానిని ఓడించాలనే ఉద్దేశంలో ఆ వ్యాఖ్యలు చేశానని చెప్పారు. అయితే దీనిని తప్పుగా ప్రచారం చేస్తున్నారని సోమవారం పేర్కొన్నారు. అది ఫ్లోలో జరిగిపోయింది.. అయితే కేవలం ఈ వ్యాఖ్యలను మాత్రమే హైలెట్ చేస్తున్నారని పేర్కొన్నారు.

Read More....

అధికారుల అత్యుత్సాహం.. వివాదంలో సీఎం భార్య!

Tags:    

Similar News