Viral news: రైతును అవమానించిన మెట్రో సిబ్బంది..తరువాత ఏం జరిగిందంటే..?
దేశానికి అన్నం పెట్టె రైతుకి మెట్రో ఎక్కే హక్కు లేదు అన్నట్లు మెట్రో సిబ్బంది ప్రవర్తించారు.
దిశ డైనమిక్ బ్యూరో: దేశానికి అన్నం పెట్టె రైతుకి మెట్రో ఎక్కే హక్కు లేదు అన్నట్లు మెట్రో సిబ్బంది ప్రవర్తించారు. ఈ ఘటన బెంగళూరులో చోటు చేసుకుంది. రాజాజీనగర్ మెట్రో స్టేషన్‌లో ఓ రైతు తాను వెళ్ళాలి అనుకున్న ప్రాంతానికి టికెట్ తీసుకున్నారు. అనంతరం మెట్రో ఎక్కడానికి సెక్యూరిటీ చెకింగ్ దగ్గరకు వెళ్లారు.
అయితే ఆ రైతు వేసుకున్న దుస్తులు బాగోలేవంటూ సెక్యూరిటీ సిబ్బంది ఆ రైతుని మెట్రో ఎక్కడానికి అనుమతించలేదు. ఈ నేపథ్యంలో అక్కడ జరుగుతున్న తంతు మొత్తం గమనిస్తున్న తోటి ప్రయాణికుడు మెట్రో సిబ్బంది తీరుపై మండిపడ్డారు. మెట్రో ఎక్కడానికి కావాల్సింది టికెట్ అని.. ఆయన ఒక రైతు.. రైతు ఇంకెలా ఉంటారు అని సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
డ్రెస్ బాగాలేకుంటే ఏమైంది..? ఆయన ఒక రైతు.. ఇదేమన్నా విఐపి ట్రాన్స్పోర్టా.. గలీజ్ బట్టల్తో రాకూడదని బోర్డు ఏమైనా ఉందా.. అని ప్రశ్నించారు. దీనితో మెట్రో సిబ్బంది ఆ రైతుని మెట్రో ఎక్కడానికి అనుమతించారు. కాగా ఈ సంఘటనపై స్పందించిన అధికారులు సెక్యూరిటీ సూపర్‌వైజర్‌ను విధుల నుంచి తొలగించారు.
బట్టలు బాగోలేవంటూ రైతును మెట్రో ఎక్కనివ్వని అధికారులు
— Telugu Scribe (@TeluguScribe) February 27, 2024
బెంగళూరు - రాజాజీనగర్ మెట్రో స్టేషన్‌లో ఓ రైతు టికెట్ తీసుకోని మెట్రో ఎక్కడానికి సెక్యూరిటీ చెకింగ్ దగ్గరకు వెళ్లగా అతని బట్టలు బాగోలేవంటూ సెక్యూరిటీ సిబ్బంది మెట్రో ఎక్కడానికి అనుమతించలేదు.
అక్కడే ఉన్న ప్రయాణికుడు మెట్రో… pic.twitter.com/uRQmv4AQWU