వినేశ్ ఫొగట్ ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు.. లోక్‌సభలో కేంద్రమంత్రి ప్రకటన
వినేశ్ ఫొగట్ వ్యవహారంపై లోక్‌సభలో కేంద్ర మంత్రి మన్సూక్ మాండవీయ ప్రకటన చేశారు. అంతర్జాతీయ ఒలంపిక్ సంఘానికి తమ నిరసన తెలియజేసినట్లు చెప్పారు.
దిశ, వెబ్‌డెస్క్: వినేశ్ ఫొగట్ వ్యవహారంపై లోక్‌సభలో కేంద్ర మంత్రి మన్సూక్ మాండవీయ ప్రకటన చేశారు. అంతర్జాతీయ ఒలంపిక్ సంఘానికి తమ నిరసన తెలియజేసినట్లు చెప్పారు. ఇప్పటివరకు వినేశ్ ఫొగట్ ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదని అన్నారు. ఫొగట్‌కు అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కాగా, అనూహ్యంగా ఫైనల్‌కు ముందు వినేశ్ ఫొగాట్‌పై అనర్హత వేటు పడింది. భారత బృందం ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ఈ ఉదయం ఫొగాట్ 50 కిలోల కంటే ఎక్కువ బరువు ఉందని ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ వెల్లడించింది. 50 కిలోల విభాగంలో పోటీ పడేందుకు కావాల్సిన బరువు కంటే ఆమె 100 గ్రాములు అధికంగా ఉందని, ఇది అనర్హతకు దారి తీయవచ్చునని సంబంధిత వర్గాలు అంతకుముందే ఆందోళన వ్యక్తం చేశాయి. ఈరోజు ఆమె 50 కిలోలకు పైగా ఉన్నట్లు ఒలింపిక్ కమిటీ గుర్తించింది. ఫొగాట్ ఈ రోజు రాత్రి ఫైనల్‌లో తలపడాల్సి ఉంది. కానీ బరువు పెరగడంతో ఒలింపిక్ కమిటీ, రెజ్లింగ్ కమిటీ అనర్హత వేటు వేశాయి.