గాడిద పాలతో మహిళలకు మరింత అందం: మేనకా గాంధీ సంచలన వ్యాఖ్యలు

బీజేపీ ఎంపీ, మాజీ కేంద్ర మంత్రి మేనకా గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. గాడిద పాలతో మహిళలు మరింత అందంగా మారుతారని అన్నారు.

Update: 2023-04-03 10:45 GMT

లక్నో: బీజేపీ ఎంపీ, మాజీ కేంద్ర మంత్రి మేనకా గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. గాడిద పాలతో మహిళలు మరింత అందంగా మారుతారని అన్నారు. ఆ పాలతో ఉపయోగించిన సబ్బులను వాడటం ద్వారా మరింత అందం పెరుగుతుందని చెప్పారు. యూపీ చౌపల్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో కాస్తా వైరల్‌గా మారింది. ఈజిప్టు రాణి క్లియోపాత్ర కూడా గాడిద పాలతో స్నానం చేసేదని అన్నారు. ‘దేశ రాజధాని ఢిల్లీలో గాడిద పాలతో చేసిన సబ్బులు రూ. 500 కు అమ్ముతున్నారు. మనం కూడా మేక, గాడిద పాలతో సబ్బులు ఎందుకు తయారు చేయకూడదు?’ అని అన్నారు. ఇది కాస్తా వైరల్‌గా మారింది. బీజేపీ ఎంపీ సౌందర్య రహస్యం బయటికొచ్చిందని నెటిజన్లు కామెంట్లు చేశారు. కాగా, గాడిద పాలను శ్వాసకోశ సమస్యల్లో నాటు వైద్యంగా గ్రామాల్లో వినియోగిస్తారన్న సంగతి తెలిసిందే.

Tags:    

Similar News