చికెన్ కోసం చిల్లర తీసుకుని కోటీశ్వరుడైన పెయింటర్

Update: 2022-01-18 06:19 GMT

దిశ, వెబ్ డెస్క్: కేరళకు చెందిన ఓ వ్యక్తికి చికెన్ కోసం బయటకు వెళ్లి సాయంత్రానికల్లా కోటీశ్వరుడయ్యాడు. దీంతో అతని కుటుంబ సభ్యుల ఆనందానికి అవధులు లేకుండాపోయింది. వివరాల్లోకి వెళితే.. కేరళలోని కొట్టాయం దగ్గరలో ఉండే కుడయంపడిలో నివసించే సదానందన్ అనే వ్యక్తి పెయింటర్ గా పని చేస్తూ ఉంటాడు. అయితే, అతనికి ఒక భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆదివారం రోజు చికెన్ కోసం ఉదయాన్నే చికెన్ తీసుకువచ్చేందుకు ఇంట్లో నుంచి బయలుదేరి వెళ్లాడు. అక్కడికి వెళ్లినంక చూసుకుంటే జేబులో రూ. 500 నోటలు ఉంది. దీంతో అతను పక్కనే ఉన్న ఓ దుకాణం వద్ద రూ. 12 కోట్లకు సంబంధించిన లాటరీ టికెట్ కొన్నాడు. ఆ లాటరీ టికెట్ కొనగా మిగిలిన డబ్బులతో అతను చికెన్ తీసుకుని ఇంటికి వచ్చాడు. సాయంత్రానికి ఆ లాటరీ నిర్వాహకులు టికెట్లను డ్రా తీయగా సదానందంకు లాటరీ తగిలినట్లు తెలిసింది. చిల్లర కోసం లాటరీ తీసుకుని ఒక్కసారిగా సదానందం కోటీశ్వరుడయ్యాడు. దీంతో సదానందం, ఆయన కుటుంబ సభ్యుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. 

Tags:    

Similar News