Mamta Kulkarni : మమతా కులకర్ణి మహామండలేశ్వర్ హోదా పదిలం!
కిన్నార్ అఖాడా మహామండలేశ్వర్(Mahamandaleshwar) హోదాకు బాలీవుడ్ నటి మమతా కులకర్ణి (Mamta Kulkarni) ఇటీవల చేసిన రాజీనామా తిరస్కరణ(Rejection of Resignation)కు గురైంది.

దిశ, వెబ్ డెస్క్ : కిన్నార్ అఖాడా మహామండలేశ్వర్(Mahamandaleshwar) హోదాకు బాలీవుడ్ నటి మమతా కులకర్ణి (Mamta Kulkarni) ఇటీవల చేసిన రాజీనామా తిరస్కరణ(Rejection of Resignation)కు గురైంది. దీంతో ఆమె ఆ హోదాలోనే కొనసాగనున్నారు. ఈ విషయాన్ని నటి ఓ వీడియో ద్వారా వెల్లడించారు. ప్రయాగ్ రాజ్ మహాకుంభమేళా సందర్భంగా జనవరి 24న ప్రాపంచిక జీవనాన్ని పరిత్యజించిన మమతాకులకర్ణి సన్యాసినిగా మారింది. మహాకుంబమేళాలో కిన్నార్ అఖాడా ఆమెకు 'మాయీ మమతానంద్ గిరి'గా ఆమెకు నామకరణం చేశారు. అత్యున్నత స్థానమైన మహామండలేశ్వర్ హోదాను కట్టబెట్టారు. అఖాడాలో చేరిన వెంటనే ఆమె అత్యున్నత స్థానమైన మహామండలేశ్వర్ హోదాను 52ఏళ్ల వయసులో పొందడం పట్ల సభ్యుల్లో పలువురు వ్యతిరేకించారు.
దీంతో ఆమెపై బహిష్కరణకు వేటు పడింది. ఈ నేపథ్యంలో తాను రాజీనామా చేసినట్టు ఫిబ్రవరి 10న మమతా కులకర్ణి ప్రకటించారు. సన్యాసినిగానే కొనసాగుతానని చెప్పారు. ఈ పరిణామాల క్రమంలో తాజాగా మమతా కులకర్ణి ఓ వీడియో విడుదల చేశారు. 'మహామండలేశ్వర్ హోదాకు నేను సమర్పించిన రాజీనామా ఆమోదం పొందలేదని.. ఆచార్య లక్ష్మీనారాయణ్ త్రిపాఠి నన్ను ఆ హోదాలో ఉంచినందుకు నేను కృతజ్ఞురాలిని" అని పేర్కొన్నారు. తొలుత భావోద్వేగంతో తన హోదాకు రాజీనామా చేశానని, అయితే ఆ తర్వాత గురువుల మార్గదర్శకంలో సనాతన ధర్మానికి సేవలు కొనసాగించేందుకు నిశ్చయించుకున్నానని మమత కులకర్ణి చెప్పారు.
''రెండ్రోజుల క్రితం కొందరు మా గురువుగారైన డాక్టర్ ఆచార్య లక్ష్మీ నారాయణ్ త్రిపాఠిపై తప్పుడు ఆరోపణలు చేశారని. అందుకు ప్రతిగా నేను రాజీనామా చేశానని వీడియోలో మమతా కులకర్ణి చెప్పుకొచ్చారు. అయితే ఆయన నా రాజీనామాను అంగీకరించలేదని.. పదవిలోనే ఉంచినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానని.. అఖాడాకు, సనాతన ధర్మ పరిరక్షణకు పునరంకితం అవుతున్నాను'' అని ఆమె చెప్పారు. మరోవైపు, ఆమె ఆ హోదాలోనే కొనసాగుతారని అఖాడాకు చెందిన ఆచార్య మహామండలేశ్వర్ లక్ష్మీనారాయణ్ త్రిపాఠీ పీటీఐకి తెలిపారు.
బాలీవుడ్ సినీ హీరోయిన్ గా 1990దశకంలో మమతా కులకర్ణి మంచి క్రేజ్ సంపాదించుకుని 2003తర్వాతా సినిమాల నుంచి వైదొలగి విదేశాలకు వెళ్లిపోయారు. ఈ క్రమంలోనే డ్రగ్స్ రాకెట్లో ఆమె పేరు వినిపించింది. పోలీసులు నోటీసులు సైతం పంపారు. ఇన్నేళ్ల తర్వాత కుంభమేళా సందర్భంగా భారత్ కు వచ్చిన ఆమె అందరినీ ఆశ్చర్యపరుస్తూ సన్యాసిగా మారి అఖాడాలో చేరడం, మహా మండలేశ్వర్ గా నియామకమైన తీరుపై చెలరేగిన వివాదం చర్చనీయాంశమైంది. మొత్తానికి సన్యాసిగా మారిన మమతా కులకర్ణి ఇక మహామండలేశ్వర్ హోదాలో కొనసాగనుండటం విశేషం.