బెంగాల్‌ను దీదీ ముస్లిం రాష్ట్రం చేస్తారేమో : కేంద్రమంత్రి

దిశ, నేషనల్ బ్యూరో : పశ్చిమ బెంగాల్‌ను ముస్లిం రాష్ట్రంగా మార్చాలని సీఎం మమతా బెనర్జీ యోచిస్తున్నట్టుగా ప్రస్తుత పరిస్థితులు ఉన్నాయని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ అన్నారు.

Update: 2024-05-15 13:49 GMT

దిశ, నేషనల్ బ్యూరో : పశ్చిమ బెంగాల్‌ను ముస్లిం రాష్ట్రంగా మార్చాలని సీఎం మమతా బెనర్జీ యోచిస్తున్నట్టుగా ప్రస్తుత పరిస్థితులు ఉన్నాయని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ అన్నారు. బెంగాల్ ఎప్పటికీ ముస్లిం మెజారిటీ రాష్ట్రంగా ఉండాలని మమతా బెనర్జీ కోరుకుంటున్నారని పేర్కొన్నారు. బిహార్ రాజధాని పాట్నాలో ప్రముఖ వార్తా సంస్థతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘2021 అసెంబ్లీ ఎన్నికలకు ముందు మమతా బెనర్జీ ప్రభుత్వంలోని ఒక మంత్రి జర్నలిస్టులతో ‘మినీ-పాకిస్తాన్’ అని పిలిచే గైడెడ్ టూర్ చేయించారు. ఇదంతా చూస్తుంటే బెంగాల్‌ రాష్ట్రాన్ని మినీ పాకిస్తాన్‌గా మార్చాలని అనుకుంటున్నట్లు అనిపిస్తోంది’’ అని కేంద్రమంత్రి చెప్పారు.దేశంలో ఇస్లామిక్ పాలనను తీసుకురావాలనే ఉద్దేశంతో ప్రతిపక్ష ఇండియా కూటమి సభ్యులు ఉన్నట్టుగా కనిపిస్తోందన్నారు.

‘‘కేంద్రంలో మళ్లీ మోడీ సర్కారు రాగానే జాతీయ పౌర రిజిస్టర్ (ఎన్‌సీఆర్), పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), యూనిఫాం సివిల్ కోడ్‌(యూసీసీ)లను అమలు చేస్తాం. జనాభా నియంత్రణ దిశగా చర్యలు తీసుకుంటాం. కిమ్ జోంగ్ ఉన్ లాంటి మమతా బెనర్జీ నియంతృత్వ పాలనకు ముగింపు పలుకుతాం’’ అని గిరిరాజ్ సింగ్ వెల్లడించారు. ‘‘రాహుల్ గాంధీ, లాలూ ప్రసాద్ యాదవ్‌లు తమను తాము ఓబీసీల శ్రేయోభిలాషులుగా చెప్పుకుంటుంటారు. కర్ణాటక రాష్ట్రంలో ఓబీసీ కోటాను కత్తిరించి ముస్లింలకు రిజర్వేషన్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీయే అని అందరూ తెలుసుకోవాలి’’ అని ఆయన పేర్కొన్నారు. కేంద్రమంత్రి గిరిరాజ్ వరుసగా రెండోసారి బిహార్‌లోని బెగుసరాయ్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు.

Tags:    

Similar News