భారత పర్యటనకు మాల్దీవుల విదేశాంగ మంత్రి

అధ్యక్షుడు మయిజూ అధికారం చేపట్టిన తర్వాత ఆ దేశం నుంచి భారత్‌కు ఓ ఉన్నతస్థాయి అధికారిక పర్యటన ఖరారు కావడం ఇదే మొదటిసారి.

Update: 2024-05-08 08:30 GMT

దిశ, నేషనల్ బ్యూరో: భారత్, మాల్దీవుల మధ్య దౌత్య పరమైన విభేదాలు కొనసాగుతున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆ దేశ విదేశాంగ మంత్రి మూసా జమీర్ భారత పర్యటనకు రానున్నారు. చైనాకు అనుకూలంగా మాల్దీవుల అధ్యక్షుడు మయిజూ అధికారం చేపట్టిన తర్వాత ఆ దేశం నుంచి భారత్‌కు ఓ ఉన్నతస్థాయి అధికారిక పర్యటన ఖరారు కావడం ఇదే మొదటిసారి. మాల్దీవుల అధ్యక్షుడిగా మయిజు బాధ్యతలు చేపట్టిన అనంతరం ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు క్షీణించాయి. భారత్‌పై పలువురు మంత్రులు చేసిన అనుచిత వ్యాఖ్యలతో దౌత్యపరమైన సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఈ కారణంగా తాజా పార్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. మాల్దీవుల నుంచి భారత బలగాలను వెనక్కి తీసుకోవాలని మయిజూ కోరారు. దానికి మే 10న గడువు కూడా విధించారు. ఈ సమయంలో ఇరు దేశాల మధ్య సమావేశం జరుగుతుండటం గమనార్హం. ఇప్పటికే మాల్దీవుల సైనికుల్లో చాలామందిని భారత్ వెనక్కి రప్పించింది. గురువారం జరిగే భేటిలో ఇరు దేశాల సంబంధాల బలోపేతానికి, ప్రాంతీయ అంశాల గురించి చర్చ ఉండనుంది.

Tags:    

Similar News