Rahul Gandhi : వయనాడ్‌ బైపోల్.. చెల్లెలు ప్రియాంకకు రాహుల్ గాంధీ సవాల్

దిశ, నేషనల్ బ్యూరో : కేరళలోని వయనాడ్‌(Wayanad) లోక్‌సభ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తన చెల్లెలు ప్రియాంకా గాంధీ(Priyanka Vadra)కి రాహుల్ గాంధీ(Rahul Gandhi) ఒక సవాల్ విసిరారు.

Update: 2024-11-11 13:17 GMT

దిశ, నేషనల్ బ్యూరో : కేరళలోని వయనాడ్‌(Wayanad) లోక్‌సభ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తన చెల్లెలు ప్రియాంకా గాంధీ(Priyanka Vadra)కి రాహుల్ గాంధీ(Rahul Gandhi) ఒక సవాల్ విసిరారు. వయనాడ్‌ను ఉత్తమ పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దడాన్ని ఛాలెంజ్‌గా పెట్టుకోవాలని ఆమెకు సూచించారు. బైపోల్ ప్రచారానికి చివరి రోజు కావడంతో.. రాహుల్, ప్రియాంక సోమవారం వయనాడ్‌లో సుడిగాలి పర్యటన చేశారు. ‘‘కేరళ గురించి టూరిస్టులు ఆలోచించినప్పుడు తొలుత వయనాడ్ గుర్తుకొచ్చేలా తీర్చిదిద్దాలి. ఇక్కడ టూరిజం పెరిగితే ప్రజల జీవితాలు మారుతాయి. ఆర్థికంగా అందరూ ఎదుగుతారు. వయనాడ్ అందాల గురించి యావత్ ప్రపంచానికి తెలిసొస్తుంది. కాబోయే ఎంపీ దీన్ని ఛాలెంజ్‌గా తీసుకోవాలి’’ అని రాహుల్ ఈసందర్భంగా వ్యాఖ్యానించారు.

‘‘రాజకీయాలకు అతీతంగా వయనాడ్‌కు నా హృదయంలో గొప్ప స్థానం ఉంది. వయనాడ్‌కు ఏదైనా మేలు జరిగితే నేను సంతోషిస్తాను. ఇక్కడున్న ప్రతి ఒక్కరికి సహాయం చేయడానికి నేను సిద్ధంగా ఉంటా’’ అని ఆయన ప్రకటించారు. కాగా, లోక్‌సభ ఎన్నికల్లో వయనాడ్‌, రాయ్‌బరేలీ ఎంపీ సీట్లలో రాహుల్‌ గాంధీ గెలిచారు. అయితే ఆయన వయనాడ్‌ను వదులుకున్నారు. దీంతో ఆ స్థానంలో బైపోల్ జరుగుతోంది. నవంబరు 13న పోలింగ్‌ జరగనుండగా, 23న ఎన్నికల ఫలితం వెలువడుతుంది. సీపీఐ అభ్యర్థిగా సత్యన్ మోకేరి, బీజేపీ అభ్యర్థిగా నవ్య హరిదాస్ పోటీ చేస్తున్నారు.

Tags:    

Similar News