MP urination case : ‘మూత్ర విసర్జన’ బాధితుడి పాదాలను కడిగిన సీఎం

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గురువారం మూత్ర విసర్జన బాధితుడిని కలిశారు.

Update: 2023-07-06 05:55 GMT

దిశ, వెబ్ డెస్క్ : మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గురువారం మూత్ర విసర్జన బాధితుడిని కలిశారు. గౌరవ సూచికంగా సీఎం గిరిజన కార్మికుడు దష్మేష్ రావత్ పాదాలను కడిగారు. జరిగిన ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ.. సీఎం అతడికి క్షమాపణలు తెలిపారు. అనంతరం కార్మికుడి పాదాలను కడుగుతున్న చిత్రాలను సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. కార్మికుడిపై మూత్ర విసర్జన చేస్తూ కెమెరాకు చిక్కిన నిందితుడు ప్రవేశ్ శుక్లాను బుధవారం మధ్య రాత్రి పోలీసులు అరెస్టు చేశారు. అదేవిధంగా సీఎం ఆదేశాలతో అతడి ఇంటిని బుల్డోజర్ తో నేలమట్టం చేయించారు అధికారులు.

Tags:    

Similar News