Lovers Romance: లవర్స్ అలా చేయడం లైంగిక నేరం కాదు: మద్రాస్ హైకోర్టు

సదరు యువకుడు 2020 నుంచి యువతితో రిలేషన్ షిప్ లో ఉన్నాడు. ఒక రోజు ఆమెను డిన్నర్ డేట్ (Dinner Date)కు పిలిచి ముద్దు పెట్టాడు. ఆపై ఆమెను కౌగిలించుకున్నాడు.

Update: 2024-11-15 11:17 GMT

దిశ, వెబ్ డెస్క్: లవర్స్ రొమాన్స్ (Lovers Romance) చేసుకోవడం సహజమని, అది లైంగిక నేరం కిందకు రాదని మద్రాస్ హై కోర్టు (Madras High Court) సంచలన తీర్పు చెప్పింది. 19 ఏళ్ల యువతిని, 21 ఏళ్ల యువకుడు ముద్దు పెట్టుకోవడంపై వేసిన కేసును కోర్టు కొట్టివేసింది. అవాంఛిత శృంగారం, బలవంతం వంటివి మాత్రమే ఐపీసీ సెక్షన్ 354-ఏ(1)(i) కిందకు వస్తాయని కోర్టు తెలిపింది.

సదరు యువకుడు 2020 నుంచి యువతితో రిలేషన్ షిప్ లో ఉన్నాడు. ఒక రోజు ఆమెను డిన్నర్ డేట్ (Dinner Date)కు పిలిచి ముద్దు పెట్టాడు. ఆపై ఆమెను కౌగిలించుకున్నాడు. ఈ విషయాన్ని యువతి తన తల్లిదండ్రులకు చెప్పి, యువకుడిని పెళ్లి చేసుకోవాలని కోరింది. అయితే ఆమెను పెళ్లాడేందుకు యువకుడు నిరాకరించాడు. ఆమెకు దూరమయ్యే ప్రయత్నం చేయడంతో.. యువకుడిపై యువతి లైంగిక వేధింపుల కేసు పెట్టింది. ఈ కేసుపై విచారణ చేసిన జస్టిస్ ఎన్ ఆనంద్ వెంకటేశ్.. యువకుడి ప్రవర్తన లైంగిక వేధింపుల సెక్షన్ కిందకు రాదన్నారు. లవర్స్ మధ్య కిస్సులు, హగ్గులు సహజమన్న జస్టిస్.. ఈ కేసులో క్రిమినల్ ప్రొసీడింగ్స్ చేస్తే.. చట్టాన్ని దుర్వినియోగం చేసినట్లేనని తీర్పులో పేర్కొన్నారు. 

Tags:    

Similar News