స్టాక్ మార్కెట్‌లో రూ 1.3 లక్షల కోట్లు పెట్టుబడి పెట్టనున్న ఎల్ఐసీ
భారత్ కు చెందిన లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 2025 ఆర్దిక సంవత్సరంలో స్టాక్ మార్కెట్‌లో రూ. 1.3 లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టనున్నట్లు మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సిద్ధార్థ మొహంతి తెలిపారు.
దిశ, వెబ్ డెస్క్: భారత్ కు చెందిన లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 2025 ఆర్దిక సంవత్సరంలో స్టాక్ మార్కెట్‌లో రూ. 1.3 లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టనున్నట్లు మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సిద్ధార్థ మొహంతి తెలిపారు. 2025 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో, ఇన్సూరెన్స్ బెహెమోత్ షేర్లలో సుమారు రూ. 38,000 కోట్ల పెట్టుబడి పెట్టింది. ఎల్‌ఐసి ఈక్విటీ మార్కెట్‌లలో చేసిన పెట్టుబడుల ద్వారా రూ. 15,500 కోట్ల లాభాన్ని ఆర్జించింది. ఈ లాభం మొదటి త్రైమాసికం కంటే 13.5% ఎక్కువగా ఉంది.
LIC మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సిద్ధార్థ మొహంతి మాట్లాడుతూ.. "మేము మార్కెట్, వాటి ధరల కదలికలను నిత్యం పరిశీలిస్తున్నాము. గత ఆర్థిక సంవత్సరంలో మంచి మంచి కనీస పెట్టుబడి పెట్టాము. LIC 2024 ఆర్థిక సంవత్సరంలో దాదాపు రూ. 1.32 లక్షల కోట్ల పెట్టుబడి పెట్టింది." అన్నాడు. జూన్ చివరి నాటికి వివిధ కంపెనీల స్టాక్స్‌లో ఎల్‌ఐసీ పెట్టుబడుల మార్కెట్ విలువ దాదాపు రూ.15 లక్షల కోట్లకు చేరుకుందని ఆయన చెప్పారు. అలాగే జూన్ చివరి నాటికి ఆస్తులు రూ. 53,58,781 కోట్లకు పెరిగాయన్నారు.
అంతకు ముందు సంవత్సరం ఇదే త్రైమాసికం చివరినాటికి రూ. 46,11,067 కోట్లతో పోలిస్తే ఇది 16.22% వృద్ధిని నమోదు చేసిందన్నారు. అలాగే మొత్తం పెట్టుబడులు ప్రస్తుతం రూ.7,30,662 కోట్లు పెరిగాయని. మార్చి 2023 లో రూ. 42,44,852 కోట్ల నుంచి మార్చి 31, 2024 నాటికి రూ. 49,75,514 కోట్లకు చేరిందన్నారు. 2024 జూన్ త్రైమాసికంలో, ఎల్‌ఐసీ నికర లాభం 10% పెరిగి రూ. 10,461 కోట్లకు చేరుకుంది. ఇది గత ఏడాది కాలంతో పోలిస్తే రూ. 9,544 కోట్లుగా ఉందని ఆయన చెప్పుకొచ్చారు.