Lawrence Bishnoi: ఈ సారి బీహార్ ఎంపీకి లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ వార్నింగ్!

బీహార్‌లోని పూర్ణియా ఎంపీ పప్పూయాదవ్‌ (Pappu Yadav)కు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి బెదిరింపులు రావడం ఇప్పుడు కలకలం సృష్టిస్తోంది.

Update: 2024-10-29 06:07 GMT

దిశ, వెబ్‌డెస్క్: బీహార్‌లోని పూర్ణియా ఎంపీ పప్పూయాదవ్‌ (Pappu Yadav)కు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి బెదిరింపులు రావడం ఇప్పుడు కలకలం సృష్టిస్తోంది. తనని బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరించిందంటూ ఓ వాట్సాప్ కాల్ ఆడియో క్లిప్‌ని విడుదల చేశారాయన. ఆ క్లిప్‌లో అవతలి వ్యక్తి సల్మాన్ ఖాన్‌ (Salman Khan)కి సంబంధించిన వ్యవహారాల్లో తల దూర్చొద్దని.. కాదని సల్మాన్‌ విషయంలో వేలు పెడితే చంపేస్తామని బెదిరించడం క్లియర్‌గా అర్థమవుతోంది. ఈ మధ్య పప్పూ యాదవ్ ఎక్స్ వేదికగా.. సల్మాన్ ఖాన్‌కు మద్దతుగా ‘‘నేనునన్నాను’’ అంటూ ఓ పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ తర్వాతే పప్పూ యాదవ్‌కు బిష్ణోయ్ గ్యాంగ్ మెంబర్ నుంచి డెత్ థ్రెట్స్ వచ్చాయి.

కాగా.. ఎన్సీపీ లీడర్ బాబా సిద్దికీని లారెన్స్ బిష్ణోయ్ (Lawrence Bishnoi) గ్యాంగ్ హతమార్చడమే కాకుండా సల్మాన్ ఖాన్‌కు సన్నిహితంగా ఉండడం వల్లే అతడిని చంపామంటూ బహిరంగంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ప్రకటన వెలువడగానే పప్పూ యాదవ్ నేరుగా లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు సవాల్ విసిరారు. ఆ గ్యాంగ్‌ను తాను అంతం చేస్తానని ఛాలెంజ్ చేశారు. సల్మాన్‌ఖాన్‌కు తానున్నానని ఎక్స్‌ వేదికగా పోస్ట్ చేశారు.

దీంతో తాజాగా ఆయనకు కూడా బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి బెదిరింపులు రావడంతో వెంటనే తనకి ఎక్స్‌ట్రా ప్రొటెక్షన్ కావలంటూ పప్పూ యాదవ్ కేంద్రాన్ని కోరారు. అయితే ఇంకా తన వినతికి కేంద్రం నుంచి రిప్లై రాలేదని ఆయన చెప్పారు.


Similar News