‘లా’ను వృత్తిగా పరిగణిస్తే సంతృప్తిని పొందలేరు.. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్

న్యాయవాదులు సానుభూతి అనే పదాన్ని మర్చిపోయి.. లాను కేవలం వృత్తిగా పరిగణించి కేసులను వాదిస్తే సంతృప్తిని పొందలేరని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ అన్నారు.

Update: 2023-06-19 17:18 GMT

పుణె : న్యాయవాదులు సానుభూతి అనే పదాన్ని మర్చిపోయి.. లాను కేవలం వృత్తిగా పరిగణించి కేసులను వాదిస్తే సంతృప్తిని పొందలేరని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ అన్నారు. ఎంత డబ్బు పెట్టినా సంతృప్తిని సొంతం చేసుకోలేమని తెలుసుకోవాలని లాయర్లకు ఆయన హితవు పలికారు. పుణెలో ఉన్న ప్రఖ్యాత ఇండియన్ లా సొసైటీ (ఐఎల్‌ఎస్) లా కాలేజీ శతాబ్ది ఉత్సవాల ప్రారంభోత్సవంలో బీఆర్ గవాయ్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు."లా అనేది ఒక వృత్తి కాదు. సమాజాన్ని, దేశాన్ని నిర్మించడంలో న్యాయవాది పాత్ర ముఖ్యమైనది. న్యాయవాదిగా ప్రాక్టీస్ చేసేటప్పుడు, న్యాయమూర్తిగా నిర్ణయం తీసుకునేటప్పుడు తప్పకుండా కావాల్సింది సానుభూతి" అని లా స్టూడెంట్స్ కు దిశా నిర్దేశం చేశారు.

ఇంగ్లీష్ న్యాయమూర్తి జస్టిస్ ఎడ్వర్డ్ అబాట్ ప్యారీ ఇచ్చిన ఏడు న్యాయవాద దీపాలను(నిజాయితీ, ధైర్యం, పరిశ్రమ, తెలివి, వాక్చాతుర్యం, తీర్పు, సహవాసం) అనుసరించాలని విద్యార్థులకు జస్టిస్ గవాయ్ సూచించారు. గతంతో పోల్చుకుంటే ఇప్పుడు విద్యార్థులు తమ కెరీర్‌లో ఎక్కువ ఆప్షన్‌లను కలిగి ఉన్నారని ఆయన చెప్పారు. రోజులో 4 గంటలు టైం ఉంటే.. ఒక గంట నేర్చుకోవడానికి, ఒక గంట చదవడానికి, మరొక గంట రాయడానికి, ఇంకో గంట విశ్రాంతికి, ఆడటానికి వెచ్చించండి అని జస్టిస్ భట్కర్ ఈ కార్యకమంలో లా స్టూడెంట్స్ కు గైడ్ చేశారు. ఐఎల్‌ఎస్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా కళాశాల శతాబ్ది లోగో, సావనీర్‌లు, ఇయర్‌బుక్‌, ఐఎల్‌ఎస్‌ చట్ట సమీక్షలను జస్టిస్ బీఆర్ గవాయ్ విడుదల చేశారు.


Tags:    

Similar News