రుతుపవనాల రాక ఆలస్యం
దేశంలోకి రుతుపవనాల రాక కొంత ఆలస్యం అయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అయితే రేపు రుతుపవనాలు కేరళను తాకనున్నాయి.
దిశ,వెబ్‌డెస్క్: దేశంలోకి రుతుపవనాల రాక కొంత ఆలస్యం అయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అయితే రేపు రుతుపవనాలు కేరళను తాకనున్నాయి. సాదారణంగా జూన్ 5 లోపే కేరళకు చేరుకునే రుతుపవనాలు ఈ సారి కాస్త ఆలస్యమయ్యాయి. రుతుపవనాల రాకకు మరో రెండ్రోజులు పట్టే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. రుతుపవనాల ఆలస్యంతో ఎండలు దంచికొడుతున్నాయి. అయితే ఇప్పటికే రుతుపవనాలు వస్తే వాతావరణం చల్లబడేది. వీటి ఆలస్యంతో ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతున్నాయి.
తెలంగాణలో రెండు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. అలాగే అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయని తెలిపింది.