Landslides : నాగాలాండ్‌లో విరిగిపడిన కొండచరియలు.. ఆరుగురు మృతి

నాగాలాండ్‌లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా దిమాపూర్‌ కోహిమా మధ్య ఉన్న జాతీయ రహదారి 29పై కొండచరియలు విరిగిపడ్డాయి.

Update: 2024-09-04 18:22 GMT
Landslides : నాగాలాండ్‌లో విరిగిపడిన కొండచరియలు.. ఆరుగురు మృతి
  • whatsapp icon

దిశ, నేషనల్ బ్యూరో: నాగాలాండ్‌లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా దిమాపూర్‌ కోహిమా మధ్య ఉన్న జాతీయ రహదారి 29పై కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా.. మరో ముగ్గురు గాయపడ్డారు. రహదారి మొత్తం తీవ్రంగా ధ్వంసమైంది. రోడ్డు పక్కన ఉన్న పలు ఇళ్లు సైతం దెబ్బతిన్నట్టు తెలుస్తోంది. ప్రమాదం అనంతరం వేలాది వాహనాలు రోడ్డుపై నిలిచిపోయాయి. దీంతో ప్రజా రవాణాకు తీవ్ర అంతరాయం కలిగింది. ఈ ఘటనపై నాగాలాండ్‌ ముఖ్యమంత్రి నెయిఫియు రియో స్పందించారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. ‘వర్షాల కారణంగా ఎన్‌హెచ్-29పై పెద్ద ఎత్తున విధ్వంసం జరగడం పట్ల తీవ్ర ఆందోళన చెందుతున్నా. అధికారులు పరిస్థితిని అంచనా వేస్తున్నారు. సహాయక చర్యలు ప్రారంభించాం. వీలైనంత త్వరగా రహదానికి పునరుద్దరిస్తాం’ అని తెలిపారు. వాతావరణ పరిస్థితుల దృష్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మృతుల కుటుంబాలకు రూ. 4లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. 


Similar News