నేవీ వైస్ చీఫ్‌గా కృష్ణ స్వామినాథన్: బాధ్యతలు చేపట్టిన సీనియర్ అధికారి
భారత నావికాదళం వైస్ చీఫ్‌గా అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు చేపట్టే ముందు ఆయన జాతీయ యుద్ధ స్మారకం వద్ద నివాళులు అర్పించారు.
దిశ, నేషనల్ బ్యూరో: భారత నావికాదళం వైస్ చీఫ్‌గా అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు చేపట్టే ముందు ఆయన జాతీయ యుద్ధ స్మారకం వద్ద నివాళులు అర్పించారు. అంతుకుముందు వైస్ చీఫ్ గా ఉన్న దినేష్ త్రిపాఠి నేవీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించడంతో ఆయన స్థానంలో స్వామినాథన్‌ను కేంద్రం వైస్ చీఫ్‌గా నియమించింది. నేషనల్ డిఫెన్స్ అకాడమీ పూర్వ విద్యార్థి అయిన 1987 జూలై 1న ఇండియన్ నేవీలోని అడుగుపెట్టిన స్వామినాథన్ పలు హోదాల్లో పని చేశారు. ఎలక్ట్రానిక్ వార్ ఫేర్‌లో నిపుణుడిగా ప్రసిద్ధి చెందారు. అంతేగాక ముంబై కేంద్రంగా ఉన్న నావికాదళ చీఫ్ ఆఫ్ పర్సనల్, కంట్రోలర్ ఆఫ్ పర్సనల్ సర్వీసెస్‌లో పనిచేశారు. నౌకాదళ శిక్షణా కార్యక్రమాల్లోనూ కీలక పాత్ర పోషించారు.అంతేగాక భారత నౌకాదళానికి చెందిన ఐదు ఫ్రంట్‌లైన్ షిప్‌లకు కృష్ణ నాయకత్వం వహించారు. ఈ నేపథ్యంలోనే ఆయనను కేంద్ర నేవీ వైస్ చీఫ్‌గా నియమించింది. కాగా, దినేష్ త్రిపాఠి మంగళవారం నేవీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే.