RG Kar College: ఆర్‌జీ కర్ కాలేజీలో ట్రెయినీ డాక్టర్ విగ్రహం.. సోషల్ మీడియాలో వివాదం

'క్రై ఆఫ్ ది అవర్ ' పేరుతో ఏర్పాటైన బాధితురాలి విగ్రహాన్ని అసిత్ సైన్ అనే కళాకారుడు రూపొందించడం జరిగింది.

Update: 2024-10-03 15:00 GMT

దిశ, నేషనల్ బ్యూరో: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన కోల్‌కతా ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజీ ట్రెయినీ డాక్టర్ అత్యాచారం, హత్య ఘటన మరోసారి చర్చనీయాంశం అయింది. ఈ ఘటనపై ఇప్పటికీ ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజీ ఆవరణలో బాధితురాలి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. దీనిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు, వివాదం నెలకొంది. 'క్రై ఆఫ్ ది అవర్ ' పేరుతో ఏర్పాటైన బాధితురాలి విగ్రహాన్ని అసిత్ సైన్ అనే కళాకారుడు వేదన, భయానకాన్ని వర్ణించేలా రూపొందించడం జరిగింది. ఈ విగ్రహం ఆర్‌జీ కర్ ప్రిన్సిపల్ కార్యాలయం ఎదుట ఉన్న భవనం వద్ద ఉంచారు. అయితే, ఈ విగ్రహానికి సంబంధించి ఫోటోలను కొందరు సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేయడంతో వైరల్ అయ్యాయి. విగ్రహ ఏర్పాటు వెనుక ఉద్దేశం మంచిదే అయినప్పటికీ, ఇది బాధితురాలిని అవమానించడమేనని కొందరు వ్యాఖ్యానించారు. విగ్రహం రూపొందించిన విధానంపై కొందరూ స్పందిస్తూ ఇది కలవరపెట్టేలా ఉందని, ఓ అత్యాచార బాధితురాలిని చూపుతూ ఇలాంటి విగ్రహం ఉండటం సరైంది కాదు, ఇందుకు ఎవరు సలహా ఇచ్చారని ప్రశ్నించారు. ఒకరి దుఃఖాన్ని గొప్పగా చిత్రీకరించడం బాధాకరం, ఇలాంటి విగ్రహాన్ని ధ్వంసం చేయడం మంచిదని మరికొందరు ఎక్స్‌లో ట్వీట్ చేశారు. 

Tags:    

Similar News