IMA : నిరసనలు ఆపేసి విధులకు హాజరుకండి.. వైద్యులకు ఐఎంఏ పిలుపు

దిశ, నేషనల్ బ్యూరో : కోల్‌కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో జూనియర్ వైద్యురాలిపై జరిగిన హత్యాచార ఘటనకు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) స్పందించింది.

Update: 2024-09-04 12:28 GMT

దిశ, నేషనల్ బ్యూరో : కోల్‌కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో జూనియర్ వైద్యురాలిపై జరిగిన హత్యాచార ఘటనకు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) స్పందించింది. ఈ కేసుకు సంబంధించి న్యాయం చేసే అంశాన్ని సుప్రీంకోర్టుకు వదిలేసి, నిరసనల్లో ఉన్న వైద్యులంతా ఇక విధులకు హాజరుకావాలని పిలుపునిచ్చింది. ‘‘ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ ఘటన యావత్ దేశపు మనస్సాక్షిని కదిలించింది. దీనిపై అంతటా ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. బాధిత జూనియర్ వైద్యురాలిని దేశమంతా తమ కుమార్తెగా దత్తత తీసుకుంది’’ అని పేర్కొంటూ ఐఎంఏ లేఖ రాసింది. సుప్రీంకోర్టు ఇవ్వబోయే తీర్పుకు యావత్ వైద్య సమాజం కట్టుబడి ఉండాలని కోరింది. 

Tags:    

Similar News