బడ్జెట్‌లో పేదలకు పనికొచ్చేదేం లేదు :ఖర్గే

దిశ, నేషనల్ బ్యూరో : కేంద్ర బడ్జెట్‌లో పేద, దిగువ మధ్యతరగతి, మధ్యతరగతి ప్రజలకు ఉపయోగపడేది ఏదీ లేదని కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు.

Update: 2024-02-01 18:13 GMT

దిశ, నేషనల్ బ్యూరో : కేంద్ర బడ్జెట్‌లో పేద, దిగువ మధ్యతరగతి, మధ్యతరగతి ప్రజలకు ఉపయోగపడేది ఏదీ లేదని కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. మధ్యంతర బడ్జెట్‌లో జవాబుదారీతనం కానీ, విజన్ కానీ కనిపించడం లేదని పేర్కొన్నారు. బడ్జెట్ ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోడీపై ప్రశంసలే ఎక్కువగా ఉన్నాయని కాంగ్రెస్ చీఫ్ విమర్శించారు. ‘‘2014 తర్వాతే దేశానికి స్వాతంత్య్రం వచ్చినట్టుగా.. ప్రధాని మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాతే దేశం ప్రజాస్వామ్యాన్ని చూస్తోందన్నట్టుగా ప్రజలకు చూపించే ప్రయత్నంలో బీజేపీ సర్కారు ఉంది’’ అని ఆయన ఎద్దేవా చేశారు. ‘‘2 కోట్ల ఉద్యోగాల హామీ ఏమైంది ? నల్లధనాన్ని వెనక్కి తీసుకొస్తామన్నారు ఏమైంది? రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేశారా ?’’ అని ఖర్గే ప్రశ్నల వర్షం కురిపించారు.

Tags:    

Similar News