Kharge: సర్దార్ పటేల్ ఆర్ఎస్ఎస్ ను హెచ్చరించింది ఈ రోజే..!

58 ఏళ్ల కిందట విధించిన నిషేదాన్ని మోడీ ఎత్తివేశారని, ఇది ప్రభుత్వోద్యోగుల నిష్పక్షపాత భావానికి, రాజ్యాంగ ఔన్నత్యానికి సవాలు విసురుతోందని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు.

Update: 2024-07-22 09:06 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: 58 ఏళ్ల కిందట విధించిన నిషేదాన్ని మోడీ ఎత్తివేశారని, ఇది ప్రభుత్వోద్యోగుల నిష్పక్షపాత భావానికి, రాజ్యాంగ ఔన్నత్యానికి సవాలు విసురుతోందని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. జాతీయ జెండాను ఆమోదించిన రోజు సందర్భంగా ఆ సమయంలో జరిగిన ఘటనలకు ప్రస్థావిస్తూ.. మోడీ ప్రభుత్వం పై పలు విమర్శలు చేశారు. భారతదేశం 1947లో ఈ రోజున తన జాతీయ జెండాను స్వీకరించిందని, త్రివర్ణ పతాకాన్ని వ్యతిరేకించిందుకు ఆర్ఎస్ఎస్ ను సర్దార్ పటేల్ హెచ్చరించారని, అలాగే 1948 ఫిబ్రవరి 4న గాంధీజీ హత్య తర్వాత ఆయన ఆర్‌ఎస్‌ఎస్‌పై నిషేధం విధించారని గుర్తుచేశారు.

1966లో ప్రభుత్వ ఉద్యోగులు, ఆర్‌ఎస్‌ఎస్ కార్యకలాపాల్లో పాల్గొనకుండా విధించిన నిషేధాన్ని 58 ఏళ్ల తర్వాత మోదీజీ ఎత్తివేశారని అన్నారు. ఇక గత 10 ఏళ్లలో రాజ్యాంగబద్ధమైన, స్వయంప్రతిపత్తి గల అన్ని సంస్థలను సంస్థాగతంగా స్వాధీనం చేసుకోవడానికి బీజేపి ఆర్‌ఎస్‌ఎస్‌ని ఉపయోగించుకున్న విషయం మనకు తెలుసని, ఇప్పడు ప్రభుత్వోద్యోగులు ఆర్‌ఎస్‌ఎస్ కార్యకలాపాల్లో పాల్గొనకూడదన్న నిషేధాన్ని ఎత్తివేసి ప్రభుత్వ కార్యాలయాల్లోని ఉద్యోగులను భావజాలం ఆధారంగా విభజించాలని మోదీజీ భావిస్తున్నారని ఆరోపించారు. ఇది ప్రభుత్వ కార్యాలయాల్లోని ప్రభుత్వోద్యోగుల నిష్పక్షపాత భావానికి, రాజ్యాంగ ఔన్నత్యానికి సవాలు విసురుతుందని, రాజ్యాంగాన్ని సవరించాలనే దురాలోచనను ప్రజలు ఎన్నికల్లో ఓడించినందున ప్రభుత్వం బహుశా ఇటువంటి చర్యలు తీసుకుంటోందని సంచలన విమర్శలు చేశారు.

ఎన్నికల్లో గెలిచి రాజ్యాంగాన్ని మార్చలేకపోతుంది కాబట్టి ఆర్‌ఎస్‌ఎస్ ప్రభుత్వ కార్యాలయాలను వెనుక తలుపు ద్వారా స్వాధీనం చేసుకుని రాజ్యాంగాన్ని తారుమారు చేస్తుందని అన్నారు. ఇది ఎలాంటి రాజకీయ ఎజెండా లేకుండా రాజ్యాంగానికి లోబడి ఆర్‌ఎస్‌ఎస్ సామాజిక సంస్థగా పనిచేస్తుందని సర్దార్ పటేల్‌కు ఆర్‌ఎస్‌ఎస్ ఇచ్చిన క్షమాపణతో పాటు ఆయనకు ఇచ్చిన హామీని కూడా ఇది ఉల్లంఘించడమేనని చెప్పారు. ఇక ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు ప్రతిపక్షాలు పోరాటం కొనసాగించాల్సి ఉంటుందని ఖర్గే సూచించారు.

Tags:    

Similar News