జ్ఞాన్ వాపి కేసులో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం

వారణాసిలోని జ్ఞాన్ వాపి మసీదు కేసులో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. మసీదు ప్రాంగణంలో లభించిన కట్టడం శివలింగమా లేక ఫౌంటేనా అనేది తేల్చేందుకు ఆధునిక శాస్త్రీయ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నిర్ణయించాలని ఇటీవల అలహాబాద్ హైకోర్టు అధికారులను ఆదేశించి.

Update: 2023-05-19 11:13 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: వారణాసిలోని జ్ఞాన్ వాపి మసీదు కేసులో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. మసీదు ప్రాంగణంలో లభించిన కట్టడం శివలింగమా లేక ఫౌంటేనా అనేది తేల్చేందుకు ఆధునిక శాస్త్రీయ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నిర్ణయించాలని ఇటీవల అలహాబాద్ హైకోర్టు అధికారులను ఆదేశించి. ఈ ఆదేశాలపై శుక్రవారం సుప్రీంకోర్టు స్టే విధించింది. అలహాబాద్ హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ ముస్లిం పార్టీ దాఖలు చేసిన పిటిషన్ పై శుక్రవారం సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహలతో కూడిన ధర్మాసనం ఇవాళ విచారణ చేపట్టింది. ఈ అంశంలో జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని ధర్మాసనం అభిప్రాయపడింది. హైకోర్టు ఆదేశాలను ప్రస్తుతానికి వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే ముస్లిం పార్టీ దాఖలు చేసిన అప్పీల్ పై కేంద్రంతో పాటు యూపీ ప్రభుత్వాల వివరణ చెప్పాలని నోటీసులు ఇచ్చింది.

Tags:    

Similar News