రాహుల్ గాంధీకి షాక్.. ఆ సిబ్బంది వెనక్కి

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేరళలోని వయనాడ్ నుంచి ఎంపీగా గెలిచిన విషయం తెలిసిందే.

Update: 2023-06-06 11:56 GMT

దిశ, వెబ్ డెస్క్: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేరళలోని వయనాడ్ నుంచి ఎంపీగా గెలిచిన విషయం తెలిసిందే. అయితే మోడీ ఇంటి పేరు వ్యవహారంలో రాహుల్ గాంధీ తన ఎంపీ పదవిని కోల్పోయారు. ఈ నేపథ్యంలో ఆయనకు కేటాయించిన ఇద్దరు వ్యక్తిగత సిబ్బందిని వెనక్కి తీసుకుంటూ కేరళ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాహుల్ గాంధీకి వ్యక్తిగత సహాయకుడిగా ఉన్న రతీశ్ కుమార్ కేఆర్, డ్రైవర్ గా పని చేసిన మహమ్మద్ రఫీలను వెనక్కి రావాలంటూ సాధారణ పరిపాలన జాయింట్ సెక్రటరీ ఆదేశాలు జారీ చేశారు. తక్షణమే తమ ఐడీ కార్డులను సరెండర్ చేయాలని సదరు సిబ్బందికి ఉత్తర్వులిచ్చారు. 

Tags:    

Similar News