ఆమ్ ఆద్మీ పార్టీకి Kejriwal Govt నోటీసులు

ఆమ్ ఆద్మీ పార్టీకి ఢిల్లీలోని కేజ్రీవాల్ సర్కార్ షాక్ ఇచ్చింది.

Update: 2023-01-12 06:53 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ఆమ్ ఆద్మీ పార్టీకి ఢిల్లీలోని కేజ్రీవాల్ సర్కార్ షాక్ ఇచ్చింది. అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వ ప్రకటనల ముసుగులో రాజకీయ ప్రకటనలను నడుపుతోందని ఆరోపిస్తూ ఆ పార్టీకి లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశాలో ఢిల్లీ ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. 10 రోజుల్లోగా రూ.164 కోట్లు చెల్లించాలని లేకుంటే పార్టీ కార్యాలయం సీజ్ చేస్తామని హెచ్చరిస్తూ సమాచార మరియు ప్రచార డైరెక్టరేట్ (డీఐపీ) రికవరీ నోటీసు జారీ చేసింది. ఆమ్ ఆద్మీ పార్టీ చెల్లించాల్సిన రూ.163 కోట్లలో రూ.99 కోట్ల 31 లక్షలు 2017 మార్చి 31 వరకు అడ్వర్టైజ్మెంట్ల కోసం ఉపయోగించిన మొత్తం కాగా.. మిగిలిన రూ.64కోట్ల 31లక్షల్ని వడ్డీ రూపంలో చెల్లించాలని స్పష్టం చేసింది. పది రోజుల్లో ఈ నగదు చెల్లించకుంటే చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని నోటీసుల్లో హెచ్చరించింది. అయితే కేజ్రీవాల్ ప్రభుత్వం ప్రభుత్వ ప్రకటనల ముసుగులో రాజకీయ ప్రయోజనాలు పొందుతోందని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా చర్యలకు ఆదేశించిన నెల రోజుల తర్వాత ఈ పరిణామం చోటు చేసుకోవడం ఆ రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తిగా మారింది. తాజా నోటీసులపై ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా స్పందించారు. బీజేపీ, లెఫ్టినెంట్ గవర్నర్ ఎన్నికైన మంత్రులను, అధికార ఆప్ పార్టీని లక్ష్యంగా చేసుకుంటోందని ఆరోపించారు. లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశాలపై ఆమ్ ఆద్మీ ప్రధాన అధికార ప్రతినిధి సౌరభ్ భరద్వాజ్ స్పందిస్తూ ఈ నోటీసు 'న్యూ లవ్ లెటర్' అని కొట్టిపారేశారు. ఆమ్ ఆద్మీ జాతీయ పార్టీగా అవతరించిందని, ఎంసీడీలో అధికారం చేజిక్కించుకున్నామని బీజేపీ కంగారుపడుతోందని మండిపడ్డారు. లెఫ్టినెంట్ గవర్నర్ బీజేపీ ఆదేశాలకు అనుగుణంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. గవర్నర్ ఆదేశాలు చట్టం దృష్టిలో నిలబడవని అన్నారు.

Also Read...

గవర్నర్ విషయంలో స్పీడ్ పెంచిన సీఎం! 

Tags:    

Similar News