Karnataka: కుమారస్వామిపై అనుచిత వ్యాఖ్యలు.. కర్ణాటక మంత్రి క్షమాపణలు
కేంద్రమంత్రి, జేడీఎస్ JD(S) నేత కుమారస్వామిపై(HD Kumaraswamy) అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు కర్ణాటక మంత్రి(Karnataka Minister) బీజెడ్ జమీర్ అహ్మద్ ఖాన్ క్షమాపణలు కోరారు.
దిశ, నేషనల్ బ్యూరో: కేంద్రమంత్రి, జేడీఎస్ JD(S) నేత కుమారస్వామిపై(HD Kumaraswamy) అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు కర్ణాటక మంత్రి(Karnataka Minister) బీజెడ్ జమీర్ అహ్మద్ ఖాన్ క్షమాపణలు కోరారు. మీడియాతో మాట్లాడుతూ..“మొదటి సారి అలాంటి పదం వాడి ఉంటే అతనికి క్షమాపణలు చెప్పేవాడిని.. ప్రేమతో అతను నన్ను 'కుల్లా' (మరగుజ్జు) అని పిలిచేవారు. నేను అతన్ని కరియన్న ( నల్ల సోదరుడు) అని పిలిచేవాడిని. ఈ వ్యాఖ్యలతో అతను లేదా ఎవరైనా బాధపడితే, నేను క్షమాపణలు కోరుతున్నాను." అని జమీర్ ఖాన్ అన్నారు.
కుమారస్వామిపై అనుచిత వ్యాఖ్యలు
అయితే, కుమారస్వామి రంగుని ఉద్దేశించి కర్ణాటక మంత్రి బీజడ్ జమీర్ అహ్మద్ ఖాన్(BZ Zameer Ahmed Khan) జ్యాత్యహంకార వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే దీన్ని జేడీఎస్, బీజేపీ వర్గాలు తీవ్రంగా ఖండించాయి. ఇలాంటి ద్వేషపూరిత వ్యాఖ్యలకు నాగరిక సమాజంలో చోటులేదని వ్యాఖ్యానించాయి. మంత్రి పదవి నుంచి జమీర్ ని తొలగించాలని డిమాండ్ చేశాయి. ఈ క్రమంలోనే కుమారస్వామికి మంత్రి క్షమాపణలు తెలిపారు. తమ ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఉందని వెల్లడించారు. కాగా.. హౌసింగ్, వక్ఫ్ మంత్రిగా ఉన్న జమీర్ గతంలో జేడీఎస్ పార్టీలో ఉన్నారు. ఆ సమయంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన కుమారస్వామికి అత్యంత సన్నిహితుడిగా కూడా పేరుంది.