Karnataka: సీఎం సిద్ధరామయ్యకు గవర్నర్ నోటీసులు.. కేబినెట్ భేటీలో సంచలన నిర్ణయం

మైసూర్ నగరాభివృద్ధి ప్రధాకార సంస్థ (ముడా) ఇంటి స్థలాల కేటాయింపులో భారీ ఎత్తున అవినీతి జరిగిందంటూ గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ సీఎం సిద్ధరామయ్యకు నోటీసులు జారీ చేశారు.

Update: 2024-08-02 08:34 GMT

దిశ, వెబ్‌డెస్క్: మైసూర్ నగరాభివృద్ధి ప్రధాకార సంస్థ (ముడా) ఇంటి స్థలాల కేటాయింపులో భారీ ఎత్తున అవినీతి జరిగిందంటూ గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ సీఎం సిద్ధరామయ్యకు నోటీసులు జారీ చేశారు. ఈ పరిణామంతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఈ క్రమంలో డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అధ్యక్షతన విధాన సౌధలో కేబినెట్ హుటాహుటిన భేటీ అయింది. సీఎంకు గవర్నర్ సోటీసులు ఇవ్వడం పట్ల డిప్యూటీ సీఎంతో పాటు మంత్రులు కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ముడా ఇంటి స్థలాల కేటాయింపు విషయంలో జారీ నోటీసులను గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ వెంటనే వెనక్కి తీసుకోవాలంటూ మంత్రి మండలి ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. ఒకవేళ నోటీసులను ఉపసంహరించుకోని పక్షంలో న్యాయ పోరాటానికి దిగాలని నిర్ణయించినట్లుగా సహకార శాఖ మంత్రి రాజణ్ణ పేర్కొన్నారు. 

Tags:    

Similar News