తాగునీరు లేక చుక్కలు చూస్తున్న కర్ణాటక ప్రజలు.. నిరు వృధా చేస్తే రూ. 5 వేలు ఫైన్

చలికాలం ముగిసి వేసవి కాలంలోకి ఇంకా అడుగు కూడా పెట్టలేదు. కానీ కర్ణాటక రాష్ట్రంలో తాగునీటి సమస్యతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Update: 2024-03-06 06:48 GMT

దిశ, వెబ్‌డెస్క్: చలికాలం ముగిసి వేసవి కాలంలోకి ఇంకా అడుగు కూడా పెట్టలేదు. కానీ కర్ణాటక రాష్ట్రంలో తాగునీటి సమస్యతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాగడానికి నీరు లేకపోవడంతో కర్ణాటక ప్రజలు ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో గార్డెన్ కోసం ఏర్పాటు చేసిన నీటిని తీసుకెళ్తున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అక్కడున్న ప్రభుత్వం స్పందించి ట్యాంకర్ల సహాయంతో ప్రజలకు నీటిని అందించారు. అయినప్పటికీ సమస్య తీరకపోవడంతో ప్రజలు నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బెంగళూరులో నీటి సరఫరాను 20 శాతం తగ్గిస్తూ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తుంది. వచ్చే వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని.. బెంగళూరు నగరంలో నీరు వృధా చేస్తే రూ.5 వేల జరిమానా, నీటి వాడకాన్ని పర్యవేక్షించేందుకు సెక్యూరిటీ గార్డు కూడా ఏర్పాటు.


Similar News