Karge: బీజేపీ ఉద్దేశపూర్వకంగానే మణిపూర్‌ను రెచ్చగొడుతోంది.. కాంగ్రెస్ చీఫ్ ఖర్గే
బీజేపీ ఉద్దేశ పూర్వకంగానే మణిపూర్‌లో విద్వేషాలను రెచ్చగొడుతోందని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే ఆరోపించారు.
దిశ, నేషనల్ బ్యూరో: బీజేపీ ఉద్దేశ పూర్వకంగానే మణిపూర్(Manipur)లో విద్వేషాలను రెచ్చగొడుతోందని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun karge) ఆరోపించారు. రాష్ట్రాన్ని తగులబెట్టాలని కాషాయపార్టీ కోరుకుంటోందని అందుకే అల్లర్ల కట్టడికి చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఎక్స్‌లో పోస్ట్ చేశారు. డబుల్ ఇంజిన్ ప్రభుత్వ హయాంలో మణిపూర్ సురక్షితంగా లేదని ఫైర్ అయ్యారు. ప్రజలు బాధలు అర్థం చేసుకోవడానికి ఒక్క రోజు కూడా ప్రధాని మోడీ (Pm modi) మణిపూర్‌ను సందర్శించలేదని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలు ఎన్నటికీ ఆయనను క్షమించబోరని తెలిపారు. మణిపూర్‌ను కాల్చివేయాలని బీజేపీ ఉద్దేశపూర్వకంగా భావిస్తున్నట్లు కనిపిస్తోందని, ఈ పరిణామాన్ని రాజకీయాలకు ఉపయోగించుకుంటోందని వెల్లడించారు. ఈ నెల 7 నుంచి జరిగిన ఘర్షణల్లో సుమారు 17 మంది ప్రాణాలు కోల్పోయారని అయినప్పటికీ ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు మణిపూర్‌లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో మహారాష్ట్రలో జరగాల్సిన ఎన్నికల ర్యాలీలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amith shah) రద్దు చేసుకున్నారు.