సుప్రీంకోర్టు 51వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా
భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు(Supreme Court) 51వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా(Justice Sanjeev Khanna) మరికొద్ది సేపట్లో బాధ్యతలు తీసుకోనున్నారు.
దిశ, వెబ్ డెస్క్: భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు(Supreme Court) 51వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా(Justice Sanjeev Khanna) మరికొద్ది సేపట్లో బాధ్యతలు తీసుకోనున్నారు. ఉదయం 10 గంటలకు సీజేఐగా జస్టిస్ సంజీవ్ ఖన్నా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఆయనతో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(President Draupadi Murmu) ప్రమాణ చేయించనున్నారు. 2025 సంవత్సరం మే 13 వరకు జస్టిస్ సంజీవ్ ఖన్నా( Sanjeev Khanna) సీజేఐ(CJI)గా కొనసాగుతారు. ఇదిలా ఉంటే దేశంలో ఇటీవల కాలంలో అత్యంత ముఖ్యమైన ఎన్నికల బాండ్లు, ఈవీఎంలు, ఆర్టికల్ 370 తదితర కేసుల్లో కీలక తీర్పులిచ్చిన జడ్జీగా.. జస్టిస్ సంజీవ్ ఖన్నా నిలిచారు. కాగా ఈ నెల 10న ముగిసిన సుప్రీంకోర్టు 50వ ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ పదవీకాలం ముగియడంతో శుక్రవారం (8వ తేదీ) న పదవీ విరమణ పొందారు.